AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బాబోయ్ దెయ్యం.. ఫోన్‌ నుంచి మెసేజ్‌లు పంపుతోంది.. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..!

Viral News: ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట, ఏదో ఒక వింత ఘటన వెలుగు చూస్తూనే ఉంటుంది. అవి నిజమో కాదో పక్కనపెడితే..

Viral News: బాబోయ్ దెయ్యం.. ఫోన్‌ నుంచి మెసేజ్‌లు పంపుతోంది.. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..!
Massages
Shiva Prajapati
|

Updated on: Apr 09, 2022 | 5:56 PM

Share

Viral News: ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట, ఏదో ఒక వింత ఘటన వెలుగు చూస్తూనే ఉంటుంది. అవి నిజమో కాదో పక్కనపెడితే.. ఆ వార్తలు జనాలను మరింత ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి.. దెయ్యం తన మొబైల్‌ నుంచి మెసేజ్‌లు పంపుతోందని, రిప్లయ్‌లు కూడా ఇస్తోందని వాదిస్తున్నాడు. అవును.. మీరు చదివింది నిజంగా నిజం. నలభై ఏళ్ల ఆ వ్యక్తి తన ప్రియురాలితో ఇంగ్లండ్‌లోని యార్క్‌ నగరానికి టూర్‌కి వెళ్లాడు. అయితే అది హాంటెడ్‌ సిటీ అని, అక్కడ ఒక పబ్‌ దగ్గర ఫొటో తీస్తే.. దెయ్యం కనిపించిందని, అప్పటి నుంచి తనకు పారానార్మల్‌ యాక్టివిటీస్‌ ఎదురవుతున్నాయని చెప్పాడు.

ఆ రోజు నుంచి తన ఫోన్‌ నుంచి తనకు తెలియకుండానే ప్రియురాలికి సందేశాలు వెళ్తున్నాయని, ఇదంతా దెయ్యం పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సదరు వ్యక్తి. అయితే, అక్కడి వైద్యులు, పోలీసు అధికారులు అతని వాదనను కొట్టిపాడేస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని మానసిక వైద్యుల పర్యవేక్షణలో విచారిస్తున్నారు పోలీసులు. అయితే పారానార్మల్‌ యాక్టివిటీని నమ్మేవారు ఈ కేసును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు మొదలయ్యాయని అతని సన్నిహితులు, అధికారులు చెబుతున్నారు.

Also read:

Ukraine – Russia War: జుట్టు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే కన్నీరు పెడతారు..!

Viral Video: 60 అడుగుల బ్రిడ్జ్‌ని మాయం చేసిన దొంగలు.. ఎలా దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!