Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!

Meat: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. మటన్ లేదా చికెన్‌ లాగించేయాల్సిందే.. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి.

Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!
Meat
Follow us

|

Updated on: Apr 09, 2022 | 7:58 PM

Meat: ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. మటన్ లేదా చికెన్‌ లాగించేయాల్సిందే.. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ అతిగా తింటే నష్టమే కానీ లాభం ఉండదు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఒకానొక సమయంలో గుండెపోటు లాంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే మాంసం తినడం మానేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. కొలెస్ట్రాల్

మాంసాహారం ఎక్కువగా తినేవారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాహారం మానేస్తే కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బులు మీకు దూరంగా ఉంటాయి.

2. బరువు

మాంసాహారాన్ని తప్పుడు పద్ధతిలో తీసుకుంటే బరువు పెరుగుతారని పలు పరిశోధనలో వెల్లడైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మాంసం తినడం మానేసిన వ్యక్తులు బరువు తగ్గడం సులభం. బదులుగా మీరు మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని పోషకాల కొరతను తీరుస్తాయి. అంతేకాదు బరువుని కూడా తగ్గిస్తాయి.

3. పేగుల పనితీరుపై ప్రభావం

మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం. దీని వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తాయి. ఈ పరిస్థితిలో మాంసం తినడం మానేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని డైట్‌లో భాగంగా చేసుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వల్ల పేగులు శుభ్రపడతాయి. వాటి సామర్థ్యం కూడా పెరుగుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Onions Benefits: వేసవిలో పచ్చిఉల్లితో అనేక లాభాలు.. ఘాటుగా తింటే ఆ సమస్య పరిష్కారం..!

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!

Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!