Anand Mahindra: ఉత్కంఠ కలిగించే వీడియో విడుదల చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా వ్యాపార వేత్తల్లో ఆయన ప్రవర్తన ప్రత్యేకమైనది. టాలెంట్(Talent) ఎక్కడ కనిపించినా ప్రోత్సహిస్తుంటారు. ఇదే సమయంలో కంపెనీ విలువను పెంచేందుకూ కృషి చేస్తారు.
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా వ్యాపార వేత్తల్లో ఆయన ప్రవర్తన ప్రత్యేకమైనది. టాలెంట్(Talent) ఎక్కడ కనిపించినా ప్రోత్సహిస్తుంటారు. ఇదే సమయంలో కంపెనీ విలువను పెంచేందుకూ కృషి చేస్తారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా ఓ వీడియోని తన ట్విట్టర్(Twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో.. మూడు నుంచి కౌంట్ డౌన్ మొదలై జీరోకి వస్తుంది. వెంటనే నేను జీరో స్కోర్ చేశారు. అయినా నాకు గర్వంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా చెబుతారు. దీంతో ఆ వీడియో ముగుస్తుంది. ఇంతకీ దీనికి అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? దానికి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన వివరణ ఏమిటో మీరే చూడండి..
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ప్రారంభమైంది. ప్రభుత్వం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ప్రోత్సహకాలను అందిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు.. వాహనాల నుంచి కర్బన ఉద్ఘారాలను నెట్ జీరోకి తీసుకురావాలనే ప్రయత్నాలు దేశంలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన ఈవీ కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతుంది. మరోవైపు మహీంద్రా గ్రూప్ నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ కంపెనీ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటనా లేదు.
ఈ తరుణంలో మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్‌మహీంద్రా నేరుగా వీడియో రీలీజ్ చేయడం.. అందులో నెట్ జీరో స్కోరును చూపిస్తూ గర్వంగా ఉంది అనడం వంటి అంశాలు మహీంద్రా నుంచి రాబోయే ఈవీ వెహికల్‌కి సంకేతాలు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్లే తనకు జీరో స్కోర్ వచ్చినా గర్వంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Are there times when you can be #ProudToBeZero ? pic.twitter.com/YvBM16iJQt
— anand mahindra (@anandmahindra) April 8, 2022
ఇవీ చదవండి..