Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ మానసిక వ్యాధిగ్రస్థుడు.. ఆయన తీరుతో దేశం స్తంభించిపోయింది”.. విపక్షాల ఘాటు వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తీరుపై ఆ దేశ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రధాని అవిశ్వాస తీర్మానంపై...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తీరుపై ఆ దేశ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రధాని అవిశ్వాస తీర్మానంపై సమావేశమైన జాతీయ అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలతో వాయిదా పడింది. ఫలితంగా తీర్మానంపై ఓటింగ్ నిర్వహించడం సాధ్యపడలేదు. ఈ పరిణామాలపై విపక్ష నేత మరియమ్ నవాజ్ సామాజిక మాధ్యమాల(Social Media) వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలివిలేని వ్యక్తి.. ఇకపై ఈ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు తాము ఏ మాత్రం అంగీకరించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను ప్రధానిగా, మాజీ ప్రధానిగా పరిగణించకూడదని విమర్శించారు. తన అధికారాన్ని కాపాడుకునేందుకు దేశం మొత్తాన్ని బందీగా ఉంచిన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా ఆయన్ను చూడాలని ఆక్షేపించారు. ఆ తీరు వల్ల దేశం మొత్తం స్తంభించిపోయిందన్న మరియన్.. 22 కోట్ల మంది ప్రజలు కొన్ని వారాలుగా ప్రభుత్వం లేకుండా ఉండిపోయారు. ఇది సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని, సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం వంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. పార్లమెంటును పునరుద్ధరిస్తున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 9న సభను నిర్వహించి ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించింది.
విపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు ఈ రోజు (శనివారం) ఉదయం జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడతో సభవాయిదా పడింది. రాత్రి ఎనిమిది గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
NH-44: ఆరు లైన్లుగా హైదరాబాద్ – బెంగళూరు హైవే.. అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం
Booster Dose: గుడ్ న్యూస్.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ధరలు తగ్గింపు.. పూర్తి వివరాలివే