AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Booster Dose: గుడ్ న్యూస్.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ధరలు తగ్గింపు.. పూర్తి వివరాలివే

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. మెరుగైన రక్షణ కోసం బూస్టర్ డోస్(Booster Dose) తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్‌ లేదా బూస్టర్ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని...

Booster Dose: గుడ్ న్యూస్.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ధరలు తగ్గింపు.. పూర్తి వివరాలివే
Covaxin Covishield
Ganesh Mudavath
|

Updated on: Apr 09, 2022 | 4:14 PM

Share

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. మెరుగైన రక్షణ కోసం బూస్టర్ డోస్(Booster Dose) తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్‌ లేదా బూస్టర్ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా స్వాగతించారు. బూస్టర్‌ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్‌(Covishield) డోసు ధరను మొదట రూ.600 కే అందుబాటులోకి తెస్తామన్నారు. అయితే సామాన్యులకు ధరాభారం కావద్దనే ఉద్దేశ్యంతో కొవిషీల్డ్ ధరను రూ.225కు తగ్గిస్తూ అదర్ పూనావాలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్(Covaxin) కూడా కొవిషీల్డ్ బాటలోనే పయనించింది. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో తాము కూడా ధరను తగ్గిస్తున్నట్లు సుచిత్రా ఎల్లా వెల్లడించారు. ప్రైవేటు క్లినిక్ లలో రూ.1200కే ఇస్తామన్న కొవాగ్జిన్ బూస్టర్ డోసును రూ.225కే అందిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

18 ఏళ్లు పైబడిన వారందరికీ రేపటి (ఏప్రిల్‌ 10) నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ చేయనుంది. ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో మాత్రమే బూస్టర్ డోసు పంపిణీ చేయనుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తైన వారందరూ ఈ డోసు టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో బూస్టర్ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also Read

Bhainsa Tension: శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతి.. నివురుగప్పిన నిప్పులా భైంసా.. నగరంలో పోలీసుల భారీ కవాతు

NIN-Hyderabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం..