NIN-Hyderabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (NIN Hyderabad).. ప్రాజెక్ట్ సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో..

NIN-Hyderabad Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో నిన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం..
Nin Hyderabad
Follow us

|

Updated on: Apr 09, 2022 | 11:33 AM

NIN-Hyderabad Project Technical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ (NIN Hyderabad).. ప్రాజెక్ట్ సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Project Technical Officer posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 5

పోస్టులు: ప్రాజెక్ట్ సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ. 15,800ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి/ఇంటర్‌/డిప్లొమా/బీఎస్సీ/సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: కాన్ఫరెన్స్‌ హాల్‌, ఐసీఎంఆర్‌ నిన్‌, హైదరాబాద్‌.

ఇంటర్వ్యూ తేదీ: 2022, ఏప్రిల్‌ 25, 26 తేదీల్లో (ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి 10 గంటల 30 నిముషాల వరకు) ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Cochin Port Authority Jobs 2022: ఇంజనీరింగ్‌ అర్హతతో.. కేరళలోని కొచ్చిన్‌ పోర్ట్‌ అథారిటీలో సైట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..