LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..

LPG Price: ప్రజల జీవితాలు సాఫీగా సాగేందుకు చాలా ముఖ్యమైన పెట్రోల్, డీజిల్, LPG, CNG లాంటి ఇంధన ధరలు గత కొన్ని రోజులుగా మన దేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట గ్యాస్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులో ఉందని మీకు తెలుసా?

LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..
Lpg Rates
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 09, 2022 | 6:42 PM

LPG Price: ప్రజల జీవితాలు సాఫీగా సాగేందుకు చాలా ముఖ్యమైన పెట్రోల్, డీజిల్, LPG, CNG లాంటి ఇంధన ధరలు గత కొన్ని రోజులుగా మన దేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట గ్యాస్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులో ఉందని మీకు తెలుసా? ఇది ఎలా జరిగింది.. దీని వెనుక ఉన్న లెక్కలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.. ఇందుకు ముందుగా మనం ఫారెక్స్ రేట్ గురించి తెలుసుకోవాలి. అందుకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక విషయాలను మనం అర్థం చేసుకోవాలి.  ఈ లెక్క ప్రకారం భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. అయితే డీజిల్ విషయంలో మనం ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నాము.

నేపాల్‌లో ఒక రూపాయికి కొనగలిగే దానికంటే ఎక్కువ వస్తువులను మనం భారత్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే అమెరికాలో మనం ఒక్క రూపాయికి ఏమీ కొనలేకపోవచ్చు. అంటే వారి దేశీయ మార్కెట్‌లోని వస్తువులను మన కరెన్సీ ఎలా కొనుగోలు చేయగలదనే దాని ప్రకారం కరెన్సీ కొనుగోలు శక్తి గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ కొనుగోలు శక్తి వేరువేరుగా ఉంటుంది. కానీ కరెన్సీ అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్లగానే కొనుగోలు శక్తి మారుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో లెక్కలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రపంచంలోని కరెన్సీల మధ్య ఏ వ్యాపారం జరిగినా అది నామమాత్రపు మారకం రేటుతో జరుగుతుంది. దీని ప్రకారం.. ఒక దేశం కరెన్సీ కొనుగోలు శక్తిని నిర్ణయిస్తారు. అదే సమయంలో ప్రతి దేశంలోని ప్రజల ఆదాయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక సగటు భారతీయుడికి.. దేశంలో లీటరు పెట్రోలు కొనుగోలు చేయడం అతని రోజువారీ ఆదాయంలో నాలుగింట ఒక వంతుగా ఉంది. మన దేశంలో రూ.100 ఖర్చు చేయటం వల్ల పొందే సదుపాయాలను అమెరికాలో పొందడానికి కనీసం 4.55 డాలర్లు అంటే రూ.345 అవసరం అవుతుంది. ఒక లీటర్ LPGని అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లెక్కల ప్రకారం కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధికంగా 3.5 డాలర్లను చెల్లిస్తున్నారు. టర్కీ, ఫిజీ దేశాల్లో మనకంటే తక్కువ ధర చెల్లిస్తున్నారు. సగటు భారతీయుడు పెట్రోల్‌కు 5.2 డాలర్లు, డీజిల్‌కు 4.6 డాలర్లు చెల్లిస్తున్నారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Anand Mahindra: ఉత్కంఠ కలిగించే వీడియో విడుదల చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ మానసిక వ్యాధిగ్రస్థుడు.. ఆయన తీరుతో దేశం స్తంభించిపోయింది”.. విపక్షాల ఘాటు వ్యాఖ్యలు

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!