AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: సతీసహగమనానికి రివర్స్ సీన్.. భార్య చితిలో దూకిన భర్త.. అసలు కారణమేంటంటే

సామాజిక దురాచారమైన సతీసహగమనం అందరికీ తెలిసిందే. అంటే భర్త మరణిస్తే అతని చితిలో భార్య దూకి ఆత్మార్పణం. అప్పట్లో సామాజిక జాఢ్యంగా పేరుకుపోయిన దీనిని కొందరు వ్యతిరేకిస్తూ నిర్మూలించారు. అయితే తాజాగా...

Crime news: సతీసహగమనానికి రివర్స్ సీన్.. భార్య చితిలో దూకిన భర్త.. అసలు కారణమేంటంటే
Fire
Ganesh Mudavath
|

Updated on: Apr 11, 2022 | 9:50 AM

Share

సామాజిక దురాచారమైన సతీసహగమనం అందరికీ తెలిసిందే. అంటే భర్త మరణిస్తే అతని చితిలో భార్య దూకి ఆత్మార్పణం. అప్పట్లో సామాజిక జాఢ్యంగా పేరుకుపోయిన దీనిని కొందరు వ్యతిరేకిస్తూ నిర్మూలించారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అయితే భర్త చితిలో దూకి భార్య దూకలేదు. భార్య చితిలో భర్త దూకాడు. ఉరివేసుకుని భార్య మృతి చెందడంలో భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శ్మశాన వాటికలో భార్య చితి మండుతుండగా అందులో దూకాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై బయటకు లాగారు. ఈ ఘటనలో బాధితుడికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మహోబా జిల్లా జైత్ పుర్ గ్రామంలో బ్రిజేష్​, ఉమ దంపతులు. ఉమకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు రూ.500 కావాలని బ్రిజేష్​ను అడిగింది. ఇప్పుడు లేవు, తర్వాతి రోజు ఇస్తానని చెప్పాడు. భర్త సమాధానంతో ఉమ తీవ్ర మనస్తాపానికి గురైంది. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో గదిలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఉమ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. వెంటనే ఉమను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జైత్‌పుర్ పట్టణంలోని శ్మశానవాటికకు తరలించారు. ఇదే సమయంలో భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజేష్ మండుతున్న భార్య చితిలోకి దూకాడు. అక్కడున్న వ్యక్తులు వెంటనే అప్రమత్తమై బ్రిజేష్ ను బయటకు లాగారు. తన భార్య చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె చనిపోయాక తనకు బతకాలని లేదని బ్రిజేష్​ చెప్పాడు. మరోవైపు.. కట్నం కోసం భర్త, అత్తమామలే తమ కూతుర్ని హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Also Read Health Tips: పులుపెక్కిన నిమ్మధరతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ లోటు పూడినట్లే

Telangana: భోజనాలు పెట్టలేదని బహిష్కరణ.. కులపెద్దల వేధింపులకు తీవ్ర మనస్తాపం.. చివరికి ఏం చేశారంటే

AP New Cabinet: ఇవాళ కొలువుదీరనున్న జగన్ నూతన మంత్రివర్గం.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం..