Ukraine Students: యుద్ధం తెచ్చిన చిక్కులు.. వైద్య విద్యార్థులకు బోధన నిరాకరణ.. భారత వైఖరే కారణం

రష్యా - ఉక్రెయన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్(Ukraine) నుంచి భారత్(India) కు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు చెప్పేందుకు నిరాకరిస్తున్నారని బాధిత విద్యార్థులు...

Ukraine Students: యుద్ధం తెచ్చిన చిక్కులు.. వైద్య విద్యార్థులకు బోధన నిరాకరణ.. భారత వైఖరే కారణం
medical Students
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 11, 2022 | 11:01 AM

రష్యా – ఉక్రెయన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్(Ukraine) నుంచి భారత్(India) కు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు చెప్పేందుకు నిరాకరిస్తున్నారని బాధిత విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. భారత వైఖరితో ఉక్రెయిన్ ప్రొఫెసర్లు అసహనంగా ఉన్నారు. భారత వ్యతిరేక ఆలోచనా ధోరణి ప్రదర్శిస్తున్నారని ఉత్తరాఖండ్​కు చెందిన వైద్య విద్యార్థులు(Medical Students) ఆరోపించారు. క్లాసులు జరిగినా నిత్యం పేలుళ్ల శబ్దాలతో అంతరాయం కలుగుతోందని వాపోయారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో చేరేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యుద్ధం కారణంగా వైద్యవిద్య మధ్యలో ఉన్నవారు పోలాండ్, హంగేరీ లాంటి దేశాల్లో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ అక్కడ ఖర్చులు అధికంగా ఉన్నాయని, ఉక్రెయిన్​తో పోలిస్తే నాలుగు రెట్లు అధికమని విద్యార్థులు వాపోయారు.

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి, యుద్ధం కారణంగా అర్థాంతరంగా తిరిగి స్వదేశానికి వచ్చిన భారత విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పలు చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు వారి కోర్సులను భారత్‌ లేదా విదేశాల్లోని ప్రైవేటు కాలేజీల్లో కొనసాగించేలా కేంద్ర వైద్య శాఖ, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు రూపొందిస్తామని అధికార వర్గాలు గతంలో వెల్లడించాయి. మరోవైపు, ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు గురించి భారతీయ వైద్య మండలి ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read

SRH vs GT Playing XI IPL 2022: గుజరాత్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో వీరికి చోటు?

Jr.NTR: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ ఆమెనేనా ?

Crime news: అదృశ్యమైన లాయర్ దారుణ హత్య.. గుప్త నిధుల కోసమేనని అనుమానం..