AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: అదృశ్యమైన లాయర్ దారుణ హత్య.. గుప్త నిధుల కోసమేనని అనుమానం..

కర్నూలు జిల్లాలో లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆయన మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్త నిధుల కోసం ఈ ఘటనకు పాల్పడి...

Crime news: అదృశ్యమైన లాయర్ దారుణ హత్య.. గుప్త నిధుల కోసమేనని అనుమానం..
crime news
Ganesh Mudavath
|

Updated on: Apr 11, 2022 | 9:28 AM

Share

కర్నూలు జిల్లాలో లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆయన మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్త నిధుల కోసం ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కర్నూలు(Kunool) లోని టెలికాం నగర్ లో నివాసముండే లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు ఈనెల 7న గోస్పాడు మండలం ఎం.చింతకుంటకు వెళ్లారు. అక్కడ అతని సోదురడు ఆవుల శివన్నను కలిశారు. అనంతరం వారిద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. రాత్రి 10 గంటలకు ఎల్లావత్తుల వద్ద వెంకటేశ్వర్లు తన తమ్ముణ్ని దింపి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి అన్న కనిపించడం లేదంటూ శివన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు గాజులపల్లి వద్ద వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం లభ్యమైంది. బైక్ కనిపించిన చోటే గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతదేహం ఆవుల వెంకటేశ్వర్లుదేనని పోలీసులు గుర్తించారు. గాయాలు ఉండటంతో హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. వెంకటేశ్వర్లు అదృశ్యమైన రోజే.. అతణ్ని చంపి మృతదేహాన్ని పడేసినట్లు భావిస్తున్నారు. హత్యకు గుప్త నిధుల వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. మృతుడి సోదరులు, పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించే దశలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఏప్రిల్ 7 నుంచి లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అదృశ్యమయ్యారు. చింతకుంటలో నివాసం ఉండే తమ్ముని వద్దకు వెళ్లిన వెంకటేశ్వర్లు.. ఇంటికి తిరిగి వస్తూ అదృశ్యమయ్యారని అతని కుటుంబీకులు తెలిపారు. ఆయన కనిపించడం లేదని, ఎలాగైనా ఆయన జాడ కనిపెట్టాలని మహానంది పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

మృతి చెందిన లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు.. తెలంగాణ హైకోర్టులో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం ఇది హత్యనా, లేక అనుమానాస్పద మరణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆవుల వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో అసమ్మతి సెగలు.. సుచరిత బాటలో గిద్దలూరు ఎమ్మెల్యే..

Mutual Funds: తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి.. వీటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్ బంగారమే..!

వీరు మైదానంలోనే శత్రువులు.. కలిస్తే మాత్రం కథ వేరుంటది..