AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి.. వీటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్ బంగారమే..!

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచింది. SIP ద్వారా, మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇందులో పెట్టుబడి పెట్టాలి. ఇది మార్కెట్ అస్థిరత వల్ల పెద్దగా ప్రభావితం కానందున..

Mutual Funds: తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి.. వీటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్ బంగారమే..!
Stocks Vs Mutual Funds
Venkata Chari
|

Updated on: Apr 11, 2022 | 8:18 AM

Share

Blue Chip Funds: స్టాక్ మార్కెట్‌(Stock Market)లో డబ్బును పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి మీకు పరిమిత జ్ఞానం ఉంటే, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి, అధిక రాబడులను పొందవచ్చు. తక్కువ రిస్క్‌తో పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం, బ్లూచిప్ ఫండ్స్ గురించి ఆలోచించవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు. బ్లూచిప్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అయితే కొన్ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వాటి పేర్లకు బ్లూచిప్‌లను జోడించాయి. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, ICICI ప్రూ బ్లూచిప్ ఫండ్, SBI బ్లూచిప్ ఫండ్, కోటక్ బ్లూచిప్ ఫండ్ లేదా ఫ్రాంక్లిన్ బ్లూచిప్ ఫండ్ లాంటివి ఈ కోటాలో ఉన్నాయి. మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్, లార్జ్ & మిడ్ క్యాప్ సెగ్మెంట్ నుంచి ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్స్ ఉన్నాయి.

తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడి..

చాలా పెద్ద పరిమాణంలో, ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్న కంపెనీలను బ్లూచిప్ కంపెనీలుగా పిలుస్తుంటా. ఈ స్టాక్స్‌లో అస్థిరత చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ భారీ లాభాలను పెట్టుబడిదారులకు అందిస్తుంటాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో టాప్ 100 కంపెనీలలో పెట్టుబడిదారుల నుంచి కార్పస్‌లో కనీసం 80 శాతం పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తుంటారు.

ఇందులో ఎవరు పెట్టుబడి పెట్టాలి?

తక్కువ రిస్క్‌తో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే పెట్టుబడిదారులకు బ్లూచిప్ ఫండ్స్ సిఫార్సు చేస్తుంటారు. కనీసం 5 సంవత్సరాల కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలలో పెట్టుబడి పెట్టాలి. ఇందులో లాక్-ఇన్ పీరియడ్ లేనప్పటికీ, అవసరమైనప్పుడు మీరు డబ్బును విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం మీ పెట్టుబడిపై ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే దీర్ఘకాలంలో ఈ రిస్క్ తగ్గుతుంది.

సిప్ ద్వారా..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచింది. SIP ద్వారా, మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇందులో పెట్టుబడి పెట్టాలి. ఇది మార్కెట్ అస్థిరత వల్ల పెద్దగా ప్రభావితం కానందున ఇది ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది.

ఈ బ్లూచిప్ ఫండ్స్ కొన్నేళ్లుగా మంచి రాబడిని అందిస్తున్నాయి..

ఫండ్ పేరు గత 1 సంవత్సరం రాబడి (%) గత 3 సంవత్సరాలుగా వార్షిక సగటు రాబడి (%). గత 5 సంవత్సరాలుగా వార్షిక సగటు రాబడి (%).
ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ 23.9 16.6 14.2
LIC MF లార్జ్ క్యాప్ ఫండ్ 20.1 16.2 13.1
టాటా లార్జ్ క్యాప్ ఫండ్ 22.2 15.8 12.8
కోటక్ బ్లూచిప్ ఫండ్ 18.6 17.4 13.8
SBI బ్లూచిప్ ఫండ్ 17.8 15.6 12.8

గమనిక: ఈకథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. స్టాక్ మార్కెట్‌తోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి, ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టే ముందు, నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Nominee Name: బ్యాంకు అకౌంట్‌, పీఎఫ్‌, ఇతర పథకాలలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు.. తాజా రేట్ల వివరాలు