Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు.. తాజా రేట్ల వివరాలు
Fixed Deposits: వడ్డీ ధరల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వడ్డీ ధరలను సవరిస్తూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ ధరలు ( Interest Rate)పెంచితే....
Fixed Deposits: వడ్డీ ధరల విషయంలో బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వడ్డీ ధరలను సవరిస్తూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ ధరలు ( Interest Rate)పెంచితే.. మరికొన్ని బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంకు (IOB) తన కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఏడాది కంటే తక్కువ వ్యవధి కలిగి రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంకు వెల్లడించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు నిర్ణయించగా, ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 3.4శాతంగా ఉంది. ఇక 30 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై వడ్డీ 3 శాతం వడ్డీ రేటు నిర్ణయించింది బ్యాంకు.
కొత్త వడ్డీ రేట్లు ఇవే..
☛ 7 రోజుల నుంచి 14 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 3 శాతం వడ్డీ
☛ 15 నుంచి 29 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 3 శాతం
☛ 30 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 3 శాతం
☛ 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.50 శాతం
☛ 61 రోజుల నుంచి 90 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 3.50 శాతం
☛ 91 రోజుల నుంచి 120 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 4.00 శాతం
☛ 121 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధి గల డిపాజిట్లపై 4.00 శాతం
☛ 180 రోజుల నుంచి 269 రోజుల కాల వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం
☛ 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి డిపాజిట్లపై 4.50 శాతం
☛ ఏడాది నుంచి రెండు సంవత్సరాల్లోపు కాల వ్యవధి డిపాజిట్లపై 5.15 శాతం
☛ రెండు సంవత్సరాల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ
☛ మూడు సంవత్సరాలుపైబడిన డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటు ఉంది.
సీనియర్ సిటిజన్లకు..
ఇక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లకు అదనంగా 0.50 శాతం లభించనుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే 80 ఏళ్లు పైబడినవారికి అదనంగా 0.75 శాతం వడ్డీని అందిస్తోంది.
ఇవి కూడా చదవండి: