Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరుగుతున్నాయి...

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 11, 2022 | 6:26 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా దేశంలో ధరలు (Rate) నిలకడగా కొనసాగుతున్నాయి. భారతదేశంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం (April 11)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,660 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయంగా కిలో వెండిపై ఏకంగా రూ.4,400 పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో నిలకడగా ఉండగా, చెన్నైలో మాత్రం రూ.4,500 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక ఢిల్లీలో కేవలం రూ.100 వరకు మాత్రమే తగ్గింది. ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, విజయవాడలో రూ.71,500 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.67,000 ఉండగా, ముంబైలో రూ.71,500 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.67,000 ఉండగా, కోల్‌కతాలో రూ.67,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Crypto Trading: అలా క్రిప్టో ట్రేడింగ్ కుదరదన్న NPCI.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కాయిన్‌బేస్‌ ప్లాట్‌ఫాం..

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిటర్లకు శుభవార్త.. ఆ స్కీమ్ గడువును మరోసారి పెంపు..