AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిటర్లకు శుభవార్త.. ఆ స్కీమ్ గడువును మరోసారి పెంపు..

ICICI Bank: ప్రైవేటా బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ కంపెనీ ఐసీఐసీఐ తన ఖాతాదారుల కోసం ఆ స్కీమ్ గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఒకసారి గడువు పెంచినప్పడికీ.. మంచి రెస్పాన్స్ రావటంతో మరోసారి గడువును పెంచుతున్నట్లు శుభవార్తను ప్రకటించింది.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిటర్లకు శుభవార్త.. ఆ స్కీమ్ గడువును మరోసారి పెంపు..
Ayyappa Mamidi
|

Updated on: Apr 10, 2022 | 9:31 PM

Share

ICICI Bank: ప్రైవేట్‌ రంగంలోని దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ శుభవార్త ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్ల(Senior Citizens) కోసం ప్రవేశపెట్టిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో భాగంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై(Fixed Deposits) ప్రత్యేకమైన వడ్డీరేట్లను సీనియర్‌ సిటిజన్ల కోసం అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా సీనియర్‌ సిటిజన్లకు అందించే 0. 50 శాతం వడ్డీరేటుకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ స్కీమ్ జనవరి 20నే ముగియాల్సి ఉండగా దానిని ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా..  మరోసారి ఎఫ్‌డీ స్కీమ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్‌ సినీయర్‌ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది.

ఈ  వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి. దాంతో పాటుగా పాత ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువగా ఉంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

WhatsApp: టెక్స్ట్ మెసేజ్ లు అక్కర్లేదు.. ఎమోజీలు చాలు..! వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్..

RRR Box Office Collection: తొక్కుకుంటూ పోతున్న ఆర్ఆర్ఆర్.. 1000 కోట్లమార్క్‌‌ను క్రాస్ చేసిన జక్కన్న మూవీ