AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: టెక్స్ట్ మెసేజ్ లు అక్కర్లేదు.. ఎమోజీలు చాలు..! వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్..

మనిషి నిత్య జీవితంలో వాట్సాప్(Whatsapp) ఒక భాగమైంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక్కసారైనా వాట్సాప్ వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం....

WhatsApp: టెక్స్ట్ మెసేజ్ లు అక్కర్లేదు.. ఎమోజీలు చాలు..! వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్..
Ganesh Mudavath
|

Updated on: Apr 10, 2022 | 7:29 PM

Share

మనిషి నిత్య జీవితంలో వాట్సాప్(Whatsapp) ఒక భాగమైంది. నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయేంతవరకు ఒక్కసారైనా వాట్సాప్ వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూనే ఉంది. కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తూ సరికొత్త సాంకేతికతను(Technology) చేతికందిస్తోంది. కొత్తగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్స్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇక యూజర్లు వచ్చే మెసేజ్‌లకు డిఫరెంట్‌ ఎమోజీ(Emoji)లతో రిప్లై ఇవ్వొచ్చు. అయితే, ఈ ఫీచర్‌ మొదట వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. తర్వాత ఇతర వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తెస్తామని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ అప్‌డేట్‌ డెస్క్‌టాప్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని వివరించింది. ప్రస్తుతం వాట్సాప్‌ లైక్, లవ్, లాఫ్, ఆశ్చర్యం, సాడ్, థ్యాంక్స్ అనే ఆరు ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ల కోరిక మేరకు ఈ రియాక్షన్స్‌కు అదనంగా మరిన్ని ఎమోజీలను తీసుకురావాలని వాట్సాప్‌ నిర్ణయించింది.

మరోవైపు.. వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి నంబర్‌ ఫోన్‌లో సేవ్‌ అయి ఉండాలి. అప్పుడు మెసేజ్‌ పంపేందుకు వీలవుతుంది. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌నుపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. కొన్ని సార్లు మనకు చికాకు కూడా తెప్పిస్తోంది. ఇలాంటి ఇబ్బందులు తీర్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. నంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ లు పంపేలా సాంకేతికతను అభివృద్ధి పరిచింది. ఈ విధానం వినియోగదారులను ఎంతగానో అకట్టుకుంది.

Also Read

Ram Charan: ఆ తమిళ హీరోలను మెగాపవర్ స్టార్ ఫాలో అవుతున్నాడా..? క్రిటిక్స్ ఏమంటున్నారంటే

Viral: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్ వేసి తాగిన నైన్త్ స్టూడెంట్స్​.. చివరకు

Andhra Pradesh: మంత్రి పదవులు దక్కనివారికి కీలక పదవులు.. కన్ఫామ్ చేసిన సీఎం జగన్