Viral: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్ వేసి తాగిన నైన్త్ స్టూడెంట్స్​.. చివరకు

ఆ విద్యార్థులంతా ఓ ఆన్​లైన్ వైరల్​ ఛాలెంజ్​లో పాల్గొన్నారు. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్​ వేసుకొని తాగారు. కాసేపటికే ఊహించని అనుభవం ఎదురయ్యింది.

Viral: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్ వేసి తాగిన నైన్త్ స్టూడెంట్స్​.. చివరకు
Viagra
Follow us

|

Updated on: Apr 10, 2022 | 6:58 PM

వారంతా 14-15 ఏళ్ల వయసు మైనర్లు. చదివేది 9వ తరగతి. ఆన్​లైన్​ ఛాలెంజ్​ పేరుతో వారు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రాణాలకు మీదకు తెచ్చింది. శృంగార సమస్యలు ఉన్నవారు వినియోగించే ఓ మెడిసిన్‌ను వారు జ్యూస్‌లో వేసి తాగారు. ఆన్​లైన్​ ఛాలెంజ్​ పేరుతో ఈ దుస్సాహసానికి పాల్పడ్డారు. దీంతో 13 మంది విద్యార్థులు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన కొలంబియా కుకుటాలోని సాన్​ బార్టోలోమ్​ స్కూల్లో ఏప్రిల్​ 5న జరిగింది. ఫ్రూట్ జ్యూస్‌లో వయాగ్రా పిల్స్ వేసుకుని తాగగానే.. వారిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. నిమిషాల్లోనే వారిలో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరికొందరికి చెమటలు పట్టడం.. కళ్లు తిరగడం సహా ఇతర సమస్యల్ని వెంటాడాయి. దీంతో వెంటనే విద్యార్థుల తల తిక్క పనిని గుర్తించిన ఉపాధ్యాయులు.. వారిని హెల్త్ సెంటర్‌కు తరలించారు. బాధితుల్లో ఇద్దరికి కొంచెం ప్రమాదకరంగా ఉందని, మిగతావారిని డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది స్కూల్ మేనేజ్‌మెంట్. సోషల్​ మీడియాలో పిల్లల కదలికలపై ఫోకస్ పెట్టాలని,  కొన్ని రకాల వెబ్‌సైట్లకు దూరంగా ఉంచేలా చూడాలని సూచనలు చేసింది.

Also Read: Andhra Pradesh: మంత్రి పదవులు దక్కనివారికి కీలక పదవులు.. కన్ఫామ్ చేసిన సీఎం జగన్