RRR Box Office Collection: తొక్కుకుంటూ పోతున్న ఆర్ఆర్ఆర్.. 1000 కోట్లమార్క్‌‌ను క్రాస్ చేసిన జక్కన్న మూవీ

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా..

RRR Box Office Collection: తొక్కుకుంటూ పోతున్న ఆర్ఆర్ఆర్.. 1000 కోట్లమార్క్‌‌ను క్రాస్ చేసిన జక్కన్న మూవీ
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 10, 2022 | 4:06 PM

RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా.. జక్కన్న చేసిన విజువల్ వండర్ కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఫిదా అయ్యారు. ఈ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఇద్దరు పెద్ద హీరోలను కలిపి ఒకే స్క్రీన్ పైన చూపించి మ్యాజిక్ చేశారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా పోటాపోటీగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ పాన్ ఇండియా బ్లక్ బస్టర్ మూవీ. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికి క్యూ కడుతున్న ఆడియన్స్.

ట్రిపులార్‌(RRR) ఫస్ట్ వీకెండ్‌ గ్రాస్ 500 కోట్లు క్రాసైనట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇండియన్ సినిమా గ్లోరీని దర్శకధీరుడు మళ్లీ తీసుకొచ్చారని, బిగ్‌ స్క్రీన్స్‌ ఇక సంక్షోభం నుంచి బైటపడ్డట్టేనని భరోసానిచ్చింది ట్రిపులార్ సినిమా. ఇది చాలదంటూ వెయ్యి కోట్ల మైల్‌స్టోన్‌ కూడా రీచ్ అయ్యింది ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్క్ ను చేరుకుందని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. హాలిడేస్ లేని సీజన్‌లో రిలీజైనప్పటికీ, జక్కన్న మ్యాజిక్ మీదున్న మోజుతో థియేటర్స్‌కి క్యూ కడుతోంది ప్రేక్షకజనం. ఓవర్సీస్‌లో అయితే తొక్కుకుంటూ పోతూనే వుందీ భారీ సినిమా. ఫస్ట్ వీకెండ్‌ వసూళ్లతోనే 9 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటి…సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మధ్య వచ్చిన హాలీవుడ్ మూవీస్‌ని కూడా క్రాస్ చేసింది జక్కన్న ఆర్ఆర్ఆర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!