Nominee Name: బ్యాంకు అకౌంట్‌, పీఎఫ్‌, ఇతర పథకాలలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

Nominee Name: బ్యాంకు అకౌంట్‌, పీఎఫ్‌, ఇతర పథకాలలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

Nominee Name: మీరు బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినా, వివిధ హెల్త్‌ ఇన్సురెన్స్‌, ఈపీఎఫ్‌ తదతర వాటిలో నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. మీరు..

Subhash Goud

|

Apr 11, 2022 | 7:39 AM

Nominee Name: మీరు బ్యాంకు ఖాతా తీసినా.. వివిధ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినా, వివిధ హెల్త్‌ ఇన్సురెన్స్‌, ఈపీఎఫ్‌ తదతర వాటిలో నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. మీరు చెప్పకపోయినా కంపెనీ అధికారులు నామినీ పేరు తప్పకుండా అడుగుతారు. అయితే.. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ.. పెట్టుబడిదారులకు, పీఎఫ్‌, ఇతర ఇన్సురెన్స్‌దారులకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మీకు వచ్చే మొత్తం నామినీ (Nominee)కి చెందుతుంది. నామినీ పేరు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గతంలో నామినీ గురించి పెట్టిగా పట్టించుకోకపోయినా.. ప్రస్తుతం నిబంధనలు మారడంతో నామినీ పేరు చేర్చడం తప్పనిసరైంది. వాస్తవానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది.

యజమాని మరణించిన సమయంలో..

పెట్టుబడులు, ఈపీఎఫ్‌, ఇన్సురెన్స్ విషయాలలో యజమాని మరణించిన సందర్భంలో.. డబ్బులను అందించేందుకు అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి. ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు రూ.25,000 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతోంది.

నామినీ పేరును మార్చుకోవచ్చు..

ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

నామినీలు ఎంత మంది ఉండవచ్చు..

బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా చేర్చే సదుపాయం ఉంది. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇలా నామినీ పేరు చేర్చితే ఖాతాదారుని ప్రయోజనాలు నామినీకి అందుతాయి. అందుకే అధికారులు పదేపదే నామినీ పేరు చేర్చాలని కోరుతుంటారు.

ఇవి కూడా చదవండి:

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు.. తాజా రేట్ల వివరాలు

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu