Cab Services: హలో గురూ క్యాబ్‌ ఎక్కుతున్నారా? అయితే పర్స్‌ ఫుల్‌గా పెట్టుకో.. ఎందుకో తెలుసా..?

Cab Services: కారణం ఏమైనా పెట్రోల్, డీజీల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రతీ వస్తువు ధర పెరిగింది. ఎక్కడ చూసినా ధరల మోత తప్పట్లేదు. ఆఖరికి సామాన్యుడికి చల్లటి ప్రయాణాన్ని..

Cab Services: హలో గురూ క్యాబ్‌ ఎక్కుతున్నారా? అయితే పర్స్‌ ఫుల్‌గా పెట్టుకో.. ఎందుకో తెలుసా..?
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Apr 10, 2022 | 8:16 AM

Cab Services: కారణం ఏమైనా పెట్రోల్, డీజీల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రతీ వస్తువు ధర పెరిగింది. ఎక్కడ చూసినా ధరల మోత తప్పట్లేదు. ఆఖరికి సామాన్యుడికి చల్లటి ప్రయాణాన్ని కూడా దూరం చేస్తున్నాయి అధిక ధరలు. తాజాగా యావత్‌ దేశంలో ఓ ఇష్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. అదే క్యాబ్‌లో ఏసీ. పెరిగిన పెట్రోల్‌ (Petrol), డీజీల్‌ (Diesel), గ్యాస్‌ ధరల (Gas Rate) కారణంగా ఏసీ ఆన్‌ చేయాలంటే వణికిపోతున్నారు డ్రైవర్లు. అటు ఎండాకాలం కావడంతో ఏసీ లేకపోతే జర్నీ చేయలేని పరిస్థితి. దీంతో ఫేర్‌కు అదనంగా కిలోమీటర్‌కు రెండు రూపాయలు ఇస్తే ఏసీ ఆన్‌ చేస్తామని చెబుతున్నారు క్యాబ్‌ డ్రైవర్లు. తాజాగా బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో క్యాబ్ డ్రైవర్లు ఇలా కారులోనే ప్రకటనలు అంటించి మరీ, ఏసీ వేసినందుకు ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు గుంజుతున్నారు. అయితే, ఇది కంపెనీ విధానం కాదని, ఏసీ కోసం అదనపు ఛార్జీ వసూలు చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని ఆయా సంస్థలు చెబుతున్నాయి.

డ్రైవర్ల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ వింటామని, ఇంధనం, సీఎన్జీ ధరల పెరుగుదల డ్రైవర్లలో ఆందోళన కలిగిస్తోందని అర్థం చేసుకున్నామని ప్రముఖ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పెంపు ప్రభావాన్ని డ్రైవర్లపై తగ్గించేందుకు కొన్ని నగరాల్లో ఛార్జీలను పెంచామని, రాబోయే రోజుల్లో పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే, ఓలా, ఊబర్‌ వంటి సంస్థ ప్రకటనలతో క్యాబ్‌ ధరల పెంపు తథ్యం అని తెలుస్తోంది. ఒకవేళ ధరలు పెంచకపోతే, తాము వాహనాలు నడపలేమని ఇప్పటికే పలుచోట్ల డ్రైవర్లు ఆందోళలు చేశారు. తమకు గిట్టుబాటు కావడం లేదని సమస్థలకు మొర పెట్టుకున్నా, ఫేర్‌ ప్రైస్‌ పెంచడం లేదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Pakistan: అవిశ్వాస తీర్మానంలో బలంలేక కుప్పకూలిన ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌.. రేపు కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..