Pakistan: అవిశ్వాస తీర్మానంలో బలంలేక కుప్పకూలిన ఇమ్రాన్‌ఖాన్ సర్కార్.. రేపు కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం
Pakistan Political Crisis: పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధరాత్రి పార్లమెంట్ (Parliament)లో జరిగిన అ..
Pakistan Political Crisis: పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధరాత్రి పార్లమెంట్ (Parliament)లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ కుప్పకూలింది. అవిశ్వాస తీర్మాణానికి గైర్హాజరైన ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan)కు బలం లేకపోవడంతో నెగ్గలేకపోయారు. ఇమ్రాన్‌ఖాన్ వర్గం సభ నుంచి వాకౌంట్ చేసింది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఓడిపోవడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. రేపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేనున్నారు. కాగా, పాక్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి పూట పాక్ జాతీయ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు భారీగా చేరుకుంటున్నారు. ఇమ్రాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా సభ్యులు వ్యరేతికంగా ఓట్లు వేయడంతో సభలో ఓటింగ్ ఏకపక్షంగా సాగింది. సభలో ఇమ్రాన్‌ఖాన్ వర్గం లేకుండా పోయింది. పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు.
పాక్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై భద్రతను కట్టదిట్టం చేశారు. ఇస్లామాబాద్‌లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. టోల్ ప్లాజాల వద్ద కూడా బలగాలు మోహరించాయి. ఓటింగ్‌కు ముందు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు రాజీనామా చేశారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్రాన్‌ఖాన్ దేశం విడిచి వెళ్లకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది.
Just saw off Prime Minister Imran Khan from Prime Minister House. He walked out gracefully and didn’t bow down. He has lifted the entire Nation. Feeling proud to be a Pakistani and blessed to have a leader like him. Pakistan Khan – Imran Khan
— Faisal Javed Khan (@FaisalJavedKhan) April 9, 2022
ఇవి కూడా చదవండి: