Sri Lankan: షాంగ్రిల్లా హోటల్ వద్ద మిలియన్ మార్చ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం
Sri Lankan: శ్రీలంకను రక్షించుకునేందుకు సింహాళీయులు ముందుకు కదిలారు. మిలియన్ మార్చ్ నిర్వహించి దేశాన్ని రక్షించుకుంటామని శపథం చేశారు. అసమర్థ ప్రభుత్వపాలనతో..
Sri Lankan: శ్రీలంకను రక్షించుకునేందుకు సింహాళీయులు ముందుకు కదిలారు. మిలియన్ మార్చ్ నిర్వహించి దేశాన్ని రక్షించుకుంటామని శపథం చేశారు. అసమర్థ ప్రభుత్వపాలనతో లంకను అథోగతి పాలుచేసిన రాజపక్సే (Rajapaksa) వెంటనే గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. శ్రీలంక (Sri Lanka) చరిత్రలోనే మిలియన్ మార్చ్ (Million March)ఓ చరిత్ర సృష్టించనుంది. పెద్దసంఖ్యలో యువత తరలివచ్చింది. కొలంబో బీచ్ రోడ్డులోని షాంగ్రిల్లా హోటల్ దగ్గర మిలియన్ మార్చ్ నిర్వహించి రాజపక్సే ప్రభత్వంపై తీవ్ర నిరసన తెలిపారు జనం. గో గొటా గో అంటూ నినాదాలు చేశారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, దేశాన్ని రక్షించుకోవడమే తమ లక్ష్యమని బీచ్‌రోడ్‌లో ప్రదర్శనకు దిగిన ప్రజలంటున్నారు. శ్రీలంక సంక్షోభం అక్కడ స్థిరపడ్డ తెలుగువాళ్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదని వండుకోవడానికి గ్యాస్ లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .ఇంతవరకూ ఎప్పుడూ ఇలాంటి పరిస్తితి చూడలేదంటున్నారు.
శ్రీలంకలో సామాన్య పౌరుల ఆకలి కేకలు తారాస్థాయికి చేరాయి. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎక్కడా వంటగ్యాస్ దొరకడం లేదు. రోజుల తరబడి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ దగ్గర అరకిలోమీటరు పైగా క్యూల్లో బారులు తీరారు జనాలు. స్టాక్ అయిపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు జనాలు. మొత్తానికి శ్రీలంకలో మిలియన్ మార్చ్‌తో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాడుతున్నారు.
ఇవి కూడా చదవండి: