AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNO: కరోనాపై ఐరాస షాకింగ్ కామెంట్స్.. ముగింపు దశలో లేదని హెచ్చరిక

దేశంలో కరోనా(Corona) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. రోజూ పదిహేను వందల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే గణాంకాలు పలు దేశాల్లోనూ ఉన్నాయి. అయితే కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అంతలోనే కొంత....

UNO: కరోనాపై ఐరాస షాకింగ్ కామెంట్స్.. ముగింపు దశలో లేదని హెచ్చరిక
Antonio Guterras
Ganesh Mudavath
|

Updated on: Apr 09, 2022 | 7:22 PM

Share

దేశంలో కరోనా(Corona) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. రోజూ పదిహేను వందల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే గణాంకాలు పలు దేశాల్లోనూ ఉన్నాయి. అయితే కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అంతలోనే కొంత వేరియంట్ల రూపంలో కలవరపెడుతోందని ఐరాస జనరల్ సెక్రటరీ(UN Secretary General) ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోందని హెచ్చరించారు. కరోనా ముగింపు దశలో లేదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు(Precautions) పాటించాల్సిందేనని హెచ్చరించారు. ప్రతిరోజూ 15 లక్షల కరోనా కేసులొస్తున్నాయన్న ఆంటోనియో.. ఆసియాలో మహమ్మారి ఉద్ధృతంగా ఉందన్నారు. ఐరోపాలో కొత్త వేవ్ విస్తరిస్తోందని తెలిపారు. కొన్ని దేశాల్లో ప్రస్తుతం అత్యధిక మరణాలు నమోదవుతున్నాయని.. కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనలు, వ్యాప్తి ఎంత వేగంగా ఉంటాయనే దానికి ఒమిక్రాన్ మనకొక రిమైండర్ అని హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మందికి ఇంకా టీకా అందలేదని, కొన్ని సంపన్న దేశాలు మాత్రం రెండో బూస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలను ఎత్తిచూపుతోందని ఆవేదన చెందారు.

“ఈ ఏడాది మధ్య నాటికి 70 శాతం మంది జనాభాకు టీకా అందించాలన్న లక్ష్యానికి మనం చాలా దూరంలో ఉన్నాం. మరోపక్క సగటున ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్ వెలుగుచూస్తోంది. ఫలితంగా ఈ సమయం చాలా ముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, ఔషధ సంస్థలు కలిసి పనిచేయాలి. సంపన్న దేశాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతివ్యక్తికి టీకా అందేలా కృషి చేయాలి”

               -ఆంటోనియో గుటెర్రస్, ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ

తాజాగా ఒమిక్రాన్ ఉత్పరివర్తనం XE పుట్టుకురాగా ఒమిక్రాన్ కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గుజరాత్‌ (Gujarat)లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ కేసు వెలుగు చూసినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక వర్గాల సమాచారం. అయితే అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.

Also Read

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

KTR: “రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు”.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్

యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో అదరగొడుతున్న బాలీవుడ్ హీరో