KTR: “రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు”.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్

యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్(CM KCR) ముందే సూచించారని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. అయినప్పటికీ రైతులను రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చగొట్టి వరి...

KTR: రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్
Ktr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 09, 2022 | 5:49 PM

యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్(CM KCR) ముందే సూచించారని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. అయినప్పటికీ రైతులను రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చగొట్టి వరి వేయించారని విమర్శించారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని, తెలంగాణ(Telangana) ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రంమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్త్ర వ్యాప్త నిరసనలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల మద్దతుతో నిర్వహించే ఈ నిరసనల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొంటున్నారు.

యాసంగి వడ్లు కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని ముందే రైతులకు కేసీఆర్ సూచించారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం కూడా.

                      – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరోవైపు.. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర దాగి ఉందని, తెలంగాణ రైతు సమాజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లేఖ రాశారు. దళారుల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీగా కమీషన్లు దండుకునేందుకు వ్యూహాలు పన్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని ఆక్షేపించారు. కేసీఆర్ కుట్రలను ఛేదించేందుకు అన్నదాతలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. రైతు పండించే ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Also Read

Andhra Pradesh: జగన్‌ కొత్త క్యాబినేట్‌లో మళ్లీ ఛాన్స్ దక్కనుందా? కొడాలి నాని ఏమన్నారంటే..

Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలివే..

అభిమానుల ముందువచ్చి సందడి చేసిన మహానటి కీర్తి సురేష్…