Viral Video: భయం, బెరుకు లేకుండా దంతాలు శుభ్రం చేసింది.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

సముద్ర గర్భం ఎన్నో రకాల జీవులకు నివాసం. జీవ వైవిధ్యానికి ఆయువుపట్టు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా మనిషి దంతాలను రొయ్య శుభ్రం చేస్తున్న దృశ్యం సోషల్...

Viral Video: భయం, బెరుకు లేకుండా దంతాలు శుభ్రం చేసింది.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Shrimp
Follow us

|

Updated on: Apr 09, 2022 | 6:39 PM

సముద్ర గర్భం ఎన్నో రకాల జీవులకు నివాసం. జీవ వైవిధ్యానికి ఆయువుపట్టు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా మనిషి దంతాలను రొయ్య శుభ్రం చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది. ఈ వైరల్(Viral) వీడియోలో ఓ రకమైన రొయ్య.. మనిషి పళ్లను శుభ్రపరుస్తుంది. ‘అమేజింగ్ నేచర్’ ఖాతా ద్వారా ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్ అయింది. స్కూబా డైవింగ్(Scubadiving) చేస్తున్న ఓ వ్యక్తి.. సముద్రంలో పగడపు దిబ్బల దగ్గర నోరు తెరుస్తాడు. అతని దగ్గరికి ఒక రొయ్య వచ్చి, తన పాదాలతో దంతాలు, చిగుళ్ల నుంచి ఆహారాన్ని, మృతకణాలను తినేసి శుభ్రం చేస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు సదరు స్కూబా డైవింగ్ చేసిన వ్యక్తి.. ‘పళ్ళు శుభ్రం కావాలంటే నన్ను సంప్రదించండి’ అని తాను పోస్ట్‌ చోసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. వాస్తవానికి సముద్రంలోకి ప్రవేశించి, రొయ్యల ద్వారా దంతాలను శుభ్రం చేసుకోగలిగితే.. ఇకపై ఎవరికి టూత్ బ్రష్, డెంటిస్ట్ ల అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దంతాలను శుభ్రం చేస్తున్న క్లీనర్ రొయ్యలు.. మహాసముద్రాల అంతటా పగడపు దిబ్బలపై నివసిస్తాయి, ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. డెడ్ స్కిన్, పరాన్నజీవులు అని పిలువబడే చిన్న హానికరమైన జంతువులను వారి శరీరాల నుంచి తొలగించడం ద్వారా రీఫ్‌లోని చేపలు శుభ్రంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి.

Also Read

KTR: “రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు”.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్

Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ మానసిక వ్యాధిగ్రస్థుడు.. ఆయన తీరుతో దేశం స్తంభించిపోయింది”.. విపక్షాల ఘాటు వ్యాఖ్యలు

NH-44: ఆరు లైన్లుగా హైదరాబాద్ – బెంగళూరు హైవే.. అంచనాలు సిద్ధం చేసిన కేంద్రం

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన