Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారతీయుడు.. ముందస్తు సర్వేలు ఏం చెబుతున్నాయి.. ఇంతకీ ఎవరితను?

భారత మూలాలున్న ఈ వ్యక్తి కొన్ని వారాల క్రితం ప్రధానమంత్రి రేసులో ముందున్నట్లు అక్కడి సర్వేలు చెప్పాయి. కానీ, ఇప్పుడు ఆ ప్రతిష్ఠ మసకబారినట్లు ఆన్‌లైన్‌ పోల్స్‌ చెబుతున్నాయి.

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారతీయుడు.. ముందస్తు సర్వేలు ఏం చెబుతున్నాయి..  ఇంతకీ ఎవరితను?
Rishi Sunak
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 10, 2022 | 6:45 AM

Britian PM Race: రిషి సునక్‌(Rishi Sunak).. ఇప్పుడు ఈ పేరు అటు బ్రిటన్‌.. ఇటు భారత్‌(India)లో ఒక్కసారిగా తెరమీదకి వచ్చింది. గ్రేట్‌ బ్రిటన్‌ని భారత మూలాలు ఉన్న వ్యక్తి రూల్‌ చేయబోతున్నాడు. ఇందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. భారత మూలాలున్న ఈ వ్యక్తి కొన్ని వారాల క్రితం ప్రధానమంత్రి(Prime Minister) రేసులో ముందున్నట్లు అక్కడి సర్వేలు చెప్పాయి. కానీ, ఇప్పుడు ఆ ప్రతిష్ఠ మసకబారినట్లు ఆన్‌లైన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఇంతకీ ఈయన ఎవరు? రిషి సునక్‌కి ఉన్న అడ్డంకులేంటి ? ఆయన బ్రిటన్‌ ప్రధాని కాకుండా కుట్ర జరుగుతోందా ? తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తూ అదే నిజమనిపిస్తుంది.

బ్రిటన్‌ ప్రధాని కావడానికి సర్వే నిర్వహిస్తే 35 శాతం మంది ఓటేసిన వ్యక్తి రిషి సునక్‌.. దీంతో గ్రేట్‌ బ్రిటన్‌ను భారత మూలాలు ఉన్న వ్యక్తి పాలించబోతున్నాడనే వార్త సంచలనంగా మారింది. కట్‌ చేస్తే నెల రోజుల వ్యవధిలో అంతా తారు మారైంది. రిషి సునక్‌కి 35 శాతం అనుకూలంగా ఉన్న ఓట్లు కాస్తా 12 శాతానికి పడిపోయాయి. ఇంతకీ ఈ నెల రోజుల్లో ఏం జరిగింది. రిషి సునక్‌ బ్రిటన్‌ ప్రధాని కాకుండా కుట్రకు తెరలేపినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

200 ఏళ్ల పాటు భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించారు. అయితే ఇప్పుడు అదే బ్రిటన్‌ దేశాన్ని భారత మూలాలు ఉన్న వ్యక్తి పాలించబోతున్నాడా? ఆ అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధాపం వినిపిస్తోంది. రిషి సునక్‌ ఇప్పుడు ఈ పేరు అటు బ్రిటన్‌లో ఇటు భారత్‌లో మార్మోగుతోంది. కాబోయే బ్రిటన్‌ ప్రధాని అంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బ్రిటన్‌ ప్రధాని కావడానికి ముందు అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కోబోతున్నారు రిషి సునక్‌.

ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా ఉన్న రిషి సునక్‌ నెక్ట్స్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనే ఊహాగానాలు ఇటీవల బ్రిటన్‌లో బాగా వినిపించాయి. దానికి కారణం కరోనా సంక్షోభ సమయంలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు రావడంతో ఒకవేళ బోరిస్‌ దిగిపోతే నెక్ట్స్‌ ప్రధాని ఎవరు అవుతారనే దానిపై సర్వేలు నిర్వహించగా 35 శాతం మంది ఆర్థికమంత్రి రిషి సునక్‌ కే ఓటేశారు. దీంతో బ్రిటన్‌ కాబోయే ప్రధాని ఆయనే అంటూ జోరుగా వార్తలు షికారు చేశాయి. అయితే రిషి సునక్‌ కు అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఒక్కసారిగా కుట్రకు తెరలేపారు ప్రతిపక్ష నేతలు.

ఒక భారతీయుడు బ్రిటన్‌ ప్రధాని కాబోతున్నాడనే వార్తను జీర్ణించుకోలేకపోయారో ఏమో.. రిషి సునక్‌కి వ్యతిరేకంగా, ఆయన్ను బ్రిటన్‌ ప్రధాని పదవికి దూరంగా జరిపేందుకు ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అందులో ప్రధానమైంది రిషి సునక్‌ భార్య, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి ట్యాక్స్‌ వ్యవహారం. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడే రిషి సునక్‌. అయితే నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తి పన్నుల అంశాన్ని తెరమీదకి తెచ్చి రిషి సునక్‌ ప్రధాని పదవి చేపట్టకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిజానికి అక్షతామూర్తి బ్రిటన్‌లో నాన్‌ డొమిసైల్‌ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. దీంతో వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులకు బ్రిటన్‌లో నాన్‌ డొమిసైల్‌ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ హోదాను అడ్డు పెట్టుకుని అక్షతమూర్తి పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే తాను చట్ట ప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు ట్యాక్స్‌ చెల్లిస్తున్నానని అక్షతామూర్తి చెబుతున్నారు. అటు రిషి సునక్‌ సన్నిహితులు మాత్రం ఇది రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో రిషి సునక్‌ బ్రిటన్‌ ప్రధాని అవుతారనే అంచనాతో ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు చేసిన కుట్రగా భావిస్తున్నారు.

కరోనా తర్వాత నిత్యావసర ధరలు పెరగడంతో ఆర్థికమంత్రిగా ఉన్న రిషి సునక్‌ తీసుకున్న నిర్ణయాల వల్లే ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అటు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి ఉన్న వ్యాపారాలకు రష్యాతో లింకులు ఉండటంతో దీన్ని ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా వాడుకున్నాయి. అయితే తనకు ఇన్ఫోసిస్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు రిషి సునక్‌. తన భార్యకు కూడా ఇన్ఫోసిస్‌ తీసుకునే నిర్ణయాలతో సంబంధం లేదని తెలిపారు. అయినా ప్రతిపక్షాలు మాత్రం రిషి సునక్‌ని టార్గెట్‌ చేయడం మానుకోలేదు.

రిషి సునక్‌ భార్య అక్షతామూర్తి పన్ను వివాదంతో పాటు తాజాగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల కూడా రిషి సునక్‌ గ్రాస్‌ పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ప్రధాని పీఠం అధిరోహించకుండా ప్రతిపక్షాలు చేసిన కుట్ర వల్లే రిషి గ్రాస్‌ పడిపోవడానికి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో మళ్లీ పుంజుకుని జనామోదాన్ని తన వైపుకు తిప్పుకుని బ్రిటన్‌ ప్రధాని పీఠంపై రిషి సునక్‌ ను చూడాలని కోరుకుందాం..

Read Also… Sri Lankan: షాంగ్రిల్లా హోటల్‌ వద్ద మిలియన్‌ మార్చ్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!