Pakistan: పాకిస్తాన్‌లో అనూహ్య పరిణామాలు.. ఆర్మీ వలయంలో ఇస్లామాబాద్.. పాక్ జాతీయ అసెంబ్లీకి చేరుకున్న ఇమ్రాన్‌ఖాన్
Pakistan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగులుతోంది. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని పాకిస్తాన్..
Pakistan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగులుతోంది. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని పాకిస్తాన్ సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు (ఏప్రిల్ 9న) ఓటింగ్‌ను నిర్వహించాలని తేల్చి చెప్పింది. అయితే పాకిస్తాన్ (Pakistan)లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ పాక్ జాతీయ అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఇస్లామాబాద్ ఆర్మీ వలయంలో ఉంది. రాత్రి 10 గంటలకు ఇస్లామాబాద్ కోర్టు తెరుచుకోగా, పాక్ సుప్రీం కోర్టు రాత్రి 12 గంటల వరకు తెరుచుకోనుంది. రాత్రి 12 గంటల లోపు ఓటింగ్ జరగకపోతే ఇమ్రాన్‌ఖాన్ అరెస్టు కానున్నారు. కోర్టు ధిక్కరణ కింద ఇమ్రాన్‌ఖాన్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. దీంతో అన్ని టోల్ ప్లాజాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా లాహోర్, ఇస్లామాబాద్‌లలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాను తొలగించారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తీరుపై ఆ దేశ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే ఇమ్రాన్‌ఖాన్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అవిశ్వాసాన్ని ఎదర్కొవడమా..? లేక కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లడమా..?. రాత్రి 12.05 గంటలకు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే కోర్టు చెప్పిన అవిశ్వాసంపై ఓటింగ్‌కు ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ నో చెప్పింది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ ఇస్లామాబాద్‌ను చుట్టుముట్టింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ అయ్యాయి. 12 గంటల్లోపు ఓటింగ్ జరగకపోతే అమ్రాన్‌ఖాన్ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: