AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా..? ఆ రోజు అసలు ఏం జరిగింది!

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా.. గతంలో అలా చేసిన వారి వ్యూహం బెడిసి కొట్టిందా. అంజయ్య, ఎన్టీఆర్, మాయావతి,..

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా..? ఆ రోజు అసలు ఏం జరిగింది!
Follow us

|

Updated on: Apr 09, 2022 | 10:29 PM

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా.. గతంలో అలా చేసిన వారి వ్యూహం బెడిసి కొట్టిందా. అంజయ్య, ఎన్టీఆర్, మాయావతి, జయలలితలకు వర్కవుట్ కాని సెంటిమెంట్ వైఎస్ జగన్ (YS Jagan)కు కలిసి వస్తుందా.. ఎన్టీఆర్ (NTR) ఆ రోజు అసలేం చేశాడు. ఎందుకు మంత్రుల రాజీనామాలు తీసుకున్నాడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జంబో కేబినెట్..

అది అక్టోబర్ 11, 1980. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య బాధ్యతలు తీసుకున్నారు. తన కేబినెట్‌లో58 మందిని తీసుకోవాల్సి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లోని 15 మంది అసమ్మతి నేతలకు పదవులు ఇవ్వడం అంజయ్యకు కత్తిమీద సామే అయింది. అయినా అందరినీ ఒకచోట చేర్చి మంత్రి మండలి ఏర్పాటు చేసినా జంబో కేబినెట్ అనే విమర్శలు వచ్చాయి. అంత మంది వద్దని పార్టీ హైకమాండ్ చెప్పడంతో తగ్గించక తప్పలేదు. అందరితో రాజీనామాలు చేయించి తిరిగి కొందరిని తీసుకోవడం వివాదానికి దారి తీసింది. రెండు రోజుల వ్యవధిలోనే కొత్త కేబినెట్ ఏర్పాటు చేసినా కలిసిరాలేదు. మంత్రి పదవి రాని వారు తిరుగుబాటు చేయడంతో పాటు అసమ్మతికి అది బీజం వేసింది. ఫలితంగా 16 నెలల కాలంలోనే సిఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది. 1982 ఫిబ్రవరి20న అంజయ్య రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ రకంగా అంజయ్య మంత్రుల రాజీనామా ప్రయోగం బెడిసికొట్టినట్లు అయింది.

ఎన్టీఆర్ కే డేర్ స్టెప్పు..

తన కేబినెట్ సభ్యులందరితో రాజీనామా చేయించారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. వారి లేఖలను గవర్నర్ కు పంపిన ఎన్టీఆర్ ఏం జరగనట్లు హస్తినకు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు, విస్తరణ పనుల కోసమే అలా వెళ్లాడని ఎన్టీఆర్ అనుచరులు చెప్పాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఎన్టీఆర్ మంత్రులందరి రాజీనామాలు తీసుకున్నాడనేది చాలా ఆసక్తికర అంశం. అది ఫిబ్రవరి 8, 1989. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నారు. తెల్లవారు జామున 3.30కే లేవడం తన కార్యకలాపాలను ప్రారంభించడం ఎన్టీఆర్ కు అలవాటు. అలా రోజు లేచే ఎన్టీఆర్ పేపర్లలో వచ్చిన ముఖ్యమైన క్లిప్పింగ్స్ ను చూస్తారు. కీలకమైన వార్తలను కట్ చేసి సిఎం వద్దకు తీసుకెళ్లేవారు ఇప్పటిలానే అప్పటి కొందరు అధికారులు. రోజులానే ఆ రోజు కూడా తెలుగుతో పాటు..ఆంగ్ల పత్రికలను తీసుకువచ్చారు అధికారులు. కానీ ఆనాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్త ఎన్టీఆర్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు రోజుల్లో ప్రవేశ పెట్టనున్న 1989-90 బడ్జెట్ వివరాలు అందులో రావడమే ఇందుకు కారణం. ఆ రోజుల్లో బడ్జెట్ ను ఎంతో పవిత్రంగా చూసేవాళ్లు. బడ్జెట్ లో ఏమి ప్రవేశ పెడతారో..ఎలాంటి తాయిలాలు అందిస్తారో ఏంటో అని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు ఎదురుచూసేవాళ్లు. ఇప్పుడు లక్షల్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా అంతగా ఆసక్తి చూపించడం లేదు. అది వేరే సంగతి.

ఆ ఐదుగురు..

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనేలేదు. కానీ బడ్జెట్ లోటు, విద్యుత్ లోటు, సాగునీటి రంగాలకు కేటాయింపుల వంటి వివరాలు పత్రికల్లో వచ్చాయి. అసెంబ్లీ సమావేశంలో ఉన్నపుడు, అసలు సభలో ప్రవేశపెట్టడానికి ముందే పత్రికలకు సమాచారం అందించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తోంది. సభలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అలాంటి సమయంలో సభలో తలదించుకునే పరిస్థితి రాకూడదని భావించారు ఎన్టీఆర్. లీక్ వీరులెవరు కనిపెట్టి వారిని తొలగిస్తే తనకు ఇబ్బంది అని భావించారు ఎన్టీఆర్. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక తర్జన భర్జనలు జరిగాయి. అనుచరులు, ప్రజా ప్రతినిధులతో మంతనాలు జరిపారు. తన కేబినెట్ లోని ఐదుగురు సీనియర్ మంత్రులు ఇందుకు కారణమని అనుమానం వచ్చింది. అందుకు అందరు మంత్రులతో రాజీనామా చేస్తే బావుంటుందని భావించారు ఎన్టీఆర్. అదే విషయాన్ని అప్పటి ఆర్థిక మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారనే వాదనుంది. మంత్రులందరితో రాజీనామా చేయిస్తే తిరుగుబాటు వస్తుందని చెప్పారట బాబు. ఎవరు ఎన్ని చెప్పినా తాను ఏం చేయదల్చుకుంటే అదే చేస్తారు ఎన్టీఆర్. అదే చేశారు. చంద్రబాబు కాదన్నా.. మరికొందరు అనుచరులు వద్దన్నా వినలేదు. అంతే. మంత్రులందరికీ ఫోన్లు చేసి రమ్మనాలని ఆదేశాలు వెళ్లాయి. ఎవరికి వారే అందుబాటులో ఉన్న వాహనాలు తీసుకుని సీఎం ఆఫీస్ కు వచ్చారు. రాజీనామా లేఖలు ఇచ్చి వెళ్లారు. వారు రావడంతోనే సెక్రటరీలు రాజీనామా లేఖల మీద సంతకాలు చేయించుకుని పంపారు. అసలు ఎందుకు రాజీనామాలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అయినా ఎవరూ పల్లెత్తు మాట అనలేదు. పెద్దగా నిరసన వ్యక్తం కాలేదు.

అల్లుడు అయినా..

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పుడు ఆరోగ్య శాఖమంత్రిగా ఉన్నారు. మీ మామయ్యగారు మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారని అధికారులు చెప్పడమే ఆలస్యం ఆయన మిగతా వారి బాటే పట్టారు. మొత్తం 31 మంది రాజీనామా లేఖలను చూసిన ఎన్టీఆర్ అన్నింటిని గవర్నర్ కుముద్ బెన్ జోషికి పంపారు. ఆ తర్వాత హస్తిన వెళ్లిన ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పనుల్లో భాగంగా గౌహతికి వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. 1989 ఫిబ్రవరి 8 సాయంత్రం నుంచి ఆంధ్రలో కేబినెట్ లేని ముఖ్యమంత్రి పరిపాలన సాగినట్లు అయింది. వారం రోజులకు పైగా కేవలం సీఎం మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 23 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 23 జిల్లాల కోసమే ఈ పని చేశారనే చర్చ జరిగినా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. కొన్ని జిల్లాలకు అసలు మంత్రులే లేరు. తనకు బాగా దగ్గర వారు చెప్పిన లెక్క ప్రకారమే ఈ పని చేశారనే వాదన లేకపోలేదు. కొన్ని జిల్లాలనుంచి మంత్రులు లేరు. అదే సమయంలో మరికొన్ని ప్రముఖ కులాల ప్రతినిధులూ లేరు. పాత వాళ్లెవరికీ చోటు దక్కలేదు. ఎన్టీఆర్ నిర్ణయం సామాన్య ప్రజలనే కాదు..మేధావులను ఆలోచింపజేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబస్ అయితే ఎన్టీఆర్ ఇలాంటి పని చేశారు ఏంటని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటమి పాలై హతవిథీ అంటూ తల పట్టుకోవాల్సి వచ్చింది.

పార్టీలో పదవులు..

మంత్రి వర్గం నుంచి తొలగించిన వారికి పార్టీ పదవులు ఇచ్చారు ఎన్టీఆర్. అప్పుడు ఎన్టీఆర్ కు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో పేరు ఉండటంతో ఎమ్మెల్యేల నుంచి పెద్దగా నిరసన వ్యక్తం కాలేదు. ఎవ్వరూ పెద్దగా రచ్చ చేయలేదు. ఒకవేళ అసమ్మతి రాజేస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవచ్చు అనే అనుమానంతో ఎవరికి వారే మౌనం దాల్చాల్చి వచ్చింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ పై మొదట అసంతృప్తిని వ్యక్తం చేసిన వ్యక్తి వసంత నాగేశ్వరరావు మాత్రమే. అమాత్య పదవులు లేని చాలా మందికి పార్టీలో కీలక పదవులు అప్పగించారు ఎన్టీఆర్. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కాగా.. పి. ఇంద్రారెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, కళా వెంకటరావు వంటి వారు ప్రాంతీయ కార్యదర్శులు అయ్యారు. ఇక కేఈ కృష్ణమూర్తి, జానారెడ్డి వంటి వారు అయితే ఉపాధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉండేందుకు ఒప్పుకోలేదు. కొన్నాళ్ల పాటు వీరు రెబెల్స్ గానే కొనసాగిన సంగతి తెలిసిందే.

బెడిసి కొట్టిన మాయావతి వ్యూహం

ఉత్తరప్రదేశ్ లో మాయావతి ప్రభుత్వం 2007లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు సగం మంది మంత్రులు వివిధ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా మంత్రివర్గంలో సగం మందిని తొలగించాల్సి వచ్చింది. 2007-2011 మధ్యలో 54 మంత్రులతో కొలువు దీరింది మాయవతి సర్కార్. కానీ ఏకంగా 25 మంది మంత్రులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చిన 2011 డిసెంబర్‌లో వారం రోజుల వ్యవధిలో పది మంది మంత్రులను మాయావతి బర్తరఫ్ చేయాల్సి రావడం మరింతగా విమర్శలకు తావిచ్చింది. అవినీతి, క్రిమినల్ కేసుల్లో యూపీ లోకాయుక్త అభియోగాలు మోపడంతో మెజారిటీ మంత్రులను తొలగించాల్సి వచ్చింది. కోట్లాది రూపాయల నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కాంలో మంత్రుల్లో ఒక వర్గం ప్రమేయం ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నిక్లలో మాయవతి పరాజయం పాలయ్యారు.

జయలలితకు ఓటమి

అనేక అవినీతి ఆరోపణలు రావడంతో గతంలో జయలలిత కొందరు మంత్రులను తొలగించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

స్కూటర్ కేబినెట్ తో కేసీఆర్

2018న‌ కేసీఆర్ కూడా తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా మహమ్మద్ అలీని మాత్రమే తీసుకున్నారు. నెల రోజుల పాలన తర్వాత మిగతా మంత్రి వర్గాన్ని తీసుకున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్. ఇద్దరే ఉన్న కేబినెట్ ను స్కూటర్ కేబినెట్ అనే చర్చ సాగింది.

ఇప్పుడు జగన్..

తన క్యాబినెట్ లోని 24 మంత్రులందరి రాజీనామాలు చేయించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి. కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఉంది. ఏపీలో అంజయ్య, ఎన్టీఆర్ లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే మంత్రుల రాజీనామాలు తీసుకున్నారు. కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. కానీ జగన్ విషయంలో ఇందుకు పూర్తి విరుద్దం. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనే రెండున్నర ఏళ్లల్లోనే మార్పులుంటాయని చెప్పారు జగన్. ఇప్పుడు అలానే చేసినా ఎంత మందిని తిరిగి తీసుకుంటారనేది ఆసక్తికర అంశమైంది.

మొత్తం మంత్రి వర్గ మార్పు ముఖ్యమంత్రుల పదవికి ఎసరు తెచ్చిన ఉదంతాలు రాజకీయ చరిత్రలో ఉన్నాయి. ఈ సారి జగన్ కు ఆ సెంటిమెంట్ కు ఆయింట్ మెంట్ పడుతుందా లేక ఇబ్బంది తెచ్చిపెడుతుందా అనేది ఆసక్తికర అంశమే. విషయం ఏదైనా ఇప్పటి వరకు ఎవరూ జగన్ కు వ్యతిరేకంగా నోరు తెరిచి మాట్లాడింది లేదు. రాను రాను ఏం జరుగుతుందో వేచి చూడాలి. సామాజిక సమీకరణలు, కులాలు, ప్రాంతాలు, లెక్కలతో కొందరికి మంత్రి పదవులు దక్కవు. వారికి సర్ది చెబుతారా లేక అర్థం చేసుకుంటారని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.

ఇవి కూడా చదవండి:

TRS Hoardings: ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు.. 11 నాటి ధర్నాకు భారీ ఏర్పాట్లు

Andhra Pradesh: జగన్‌ కొత్త క్యాబినేట్‌లో మళ్లీ ఛాన్స్ దక్కనుందా? కొడాలి నాని ఏమన్నారంటే..

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??