AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Hoardings: ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు.. 11 నాటి ధర్నాకు భారీ ఏర్పాట్లు

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న...

TRS Hoardings: ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు.. 11 నాటి ధర్నాకు భారీ ఏర్పాట్లు
Trs Hordings In Delhi
Ganesh Mudavath
|

Updated on: Apr 09, 2022 | 9:43 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్(TRS) పార్టీ.. రేపు ఢిల్లీలో భారీ నిరసన దీక్ష చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వివిధ డిజైన్లతో కూడిన భారీ హోర్డింగ్ లను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించేలా ఈ హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీసేలా ఏర్పాటైన ఈ హోర్డింగులు విస్తృతమైన చర్చకు తెరలేపాయి.

యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో TRS పార్టీ నేతృత్వంలో నిర్వహించనున్న ధర్నా ఏర్పాట్లను రైతు సమన్వయ సమతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ధర్నాకు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Also Read

Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..

Viral Video: ప్రేమంటే ఇదే మరి.. ఆడపిల్లే అదృష్ట దేవతంటూ.. ఈ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు!

Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ మానసిక వ్యాధిగ్రస్థుడు.. ఆయన తీరుతో దేశం స్తంభించిపోయింది”.. విపక్షాల ఘాటు వ్యాఖ్యలు