Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..

Interest Rates: వడ్డీ రేట్లు పెరిగితే ఏమి జరుగుతుంది. ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుతున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్(Reserve Bank) కూడా వడ్డీ రేట్లను పెంచాలని చూస్తోంది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచింది.

Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..
Interest Rates
Follow us

|

Updated on: Apr 09, 2022 | 8:12 PM

Interest Rates: వడ్డీ రేట్లు పెరిగితే ఏమి జరుగుతుంది. ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుతున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్(Reserve Bank) కూడా వడ్డీ రేట్లను పెంచాలని చూస్తోంది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు తనకు లాభదాయకంగా ఉంటుందా లేదా అని ప్రస్తుతం జ్యోతి ఆలోచనలో పడింది. వడ్డీ రేట్లు పెరిగితే అప్పులు తీసుకోవడం ఖరీదుగా మారుతుంది. కానీ.. మీరు సేవ్ చేసిన డబ్బుపై​అధిక రాబడిని కూడా పొందుతారు. అయితే.., జ్యోతికి మరో సమస్య కూడా ఉంది. అదేంటంటే షేర్ల గురించి. ఇది ఆమె షేర్ హోల్డింగ్‌లను ఎలా ప్రభావితం చేస్తుందని ఆలోచిస్తోంది. అసలు ఇంతకీ వడ్డీ రేట్ల పెంపు గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా అని ఆలోచనలో పడింది. ఆమె టెన్షన్ సమంజసమైనదే.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని జ్యోతి లాగానే అనేక మంది వ్యక్తులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ముందుగా జ్యోతి తప్పనిసరిగా వడ్డీ రేటు సైకిల్ ను అర్థం చేసుకోవాలి. అంటే.. వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అన్న విషయాన్ని గ్రహించాలి. ఈ విషయాన్ని తెలుసుకోవటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. కొవిడ్ కారణంగా సరఫరాలో అంతరాయాలు.. దానికి తోడు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. USలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ముడి చమురు నుంచి వంట నూనె వరకూ.. ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారిపోయాయి. US ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచింది. మున్ముందు మరిన్ని రేట్ల పెంపు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. భారత్‌లో కూడా రేట్ల పెంపు దాదాపు ఖాయమైంది. RBI రేట్లను 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని అర్థం వడ్డీ రేటు సైకిల్ మారుతోందని.. దీని వల్ల అందరూ అధిక వడ్డీ రేట్ల పరిధిలోకి వెళుతున్నారని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. జ్యోతి పెట్టుబడి పెట్టిన షేర్ల పరిస్థితి ఏమిటన్నదే.

అసలు విషయం ఏమిటంటే వడ్డీ రేట్లకు.. స్టాక్ మార్కెట్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే కంపెనీల లాభాలు తగ్గుతాయి. 2012-13లోనూ అదే జరిగింది. ఆ సమయంలో కంపెనీలు తమ అమ్మకాల్లో 4 శాతం ఆదాయాన్ని వడ్డీ చెల్లించేందుకు వినియోగించాయి. 2008-09లో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా ఈ చెల్లింపుల విలువ కేవలం 1.6 శాతంగానే ఉంది. 2012-13 మెుదటి ఆరు నెలల్లో కంపెనీల అమ్మకాల్లో నికర లాభం 6.4% ఉండగా.. అంతకుముందు 4 ఏళ్లలో అమ్మకాల్లో లాభం 9.2%గా ఉంది. US ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే బాండ్ కొనుగోలు కార్యక్రమాన్ని తగ్గించి, వడ్డీ రేట్లను పెంచుతుందో.. అప్పుడు దాని ఒత్తిడి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లు అనుభవిస్తాయని తేజీ మండి వ్యవస్థాపకుడు CIO వైభవ్ అగర్వాల్ చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంకులు రేట్లు పెంచడం ప్రారంభించినప్పుడు మార్కెట్లు వాస్తవానికి పెరిగాయి.

మెుదటగా ఒకవేళ వడ్డీ రేట్ల పెంపు ఉన్నట్లయితే.. ఆ ప్రభావం ప్రతి రంగంపైనా ఉంటుంది. కానీ ప్రభావ తీవ్రత వేరు వేరుగా ఉంటుంది. దీనికి అర్థం కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం, మరికొన్నింటిపై తక్కువ ప్రభావం ఉంటుందని అర్థం. బ్యాంకింగ్, NBFC, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో సెక్టార్ వంటి రంగాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మరోవైపు FMCG రంగంపై రేట్ల పెంపు ప్రభావం తక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ మన దేశంలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. GDP వృద్ధి రేటు బాగానే ఉంది, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు బలంగా, క్లీన్ గా ఉంటే ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటని ఆలోచిస్తోంది జ్యోతి. కాబట్టి వాస్తవం ఏమిటంటే.. పెరుగుతున్న కమోడిటీ, ముడిసరుకు ధరలు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సందర్భంలో వడ్డీ రేట్లు పెరిగితే కంపెనీలకు సమస్యలు మరింతగా పెరుగుతాయి. అంటే మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ముగిసినట్లేనా అని ప్రశ్న తలెత్తుతోంది.

ఒక్కసారి మార్కెట్ చరిత్రను పరిశీలిద్దాం..2010, 2013 మధ్య రెపో రేటు 3 సార్లు పెరిగింది. ఆ తర్వాత రెపో రేటు 4.75% నుంచి 7.75%కి చేరుకుంది. కానీ ఆ సమయంలో నిఫ్టీ 958 పాయింట్లు పెరిగి 5,262 నుంచి 6,220కు చేరుకుని 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు జ్యోతికి విషయం పూర్తిగా అర్థమైంది. వడ్డీ రేట్ల విషయంలో ఆమె భయం తగ్గింది. వడ్డీ రేటు సైకిల్ లో వచ్చిన మార్పును పరిశీలిస్తే.. మీరు మీ పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవడం మంచిది. తమ మార్జిన్‌లను కాపాడుకునే కంపెనీల్లో ప్రస్తుతం ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టాలి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Delisting of shares: కంపెనీల డీలిస్టింగ్ అంటే ఏమిటి.. ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..

Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!