Power Holiday: అటు ఏప్రిల్‌ ఎండమంట.. ఇటు కరెంట్‌ కోత.. ఏపీలో పెరిగిపోతున్న కరెంట్‌ కష్టాలు.. ఆస్పత్రుల్లో రోగుల నరకం

Power Holiday: అటు ఏప్రిల్‌ ఎండమంట.. ఇటు కరెంట్‌ కోత.. ఏపీలో పెరిగిపోతున్న కరెంట్‌ కష్టాలు.. ఆస్పత్రుల్లో రోగుల నరకం
Ap Power Holiday

Power Holiday: ఏపీలో విద్యుత్‌కోతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పవర్‌కట్‌ ప్రభావం పరిశ్రమలను షేక్‌ చేస్తుండగా...అటు ఇళ్లలోనూ గంటల తరబడి కరెంట్‌ కోతతో జనం అల్లాడిపోతున్నారు..

Subhash Goud

|

Apr 10, 2022 | 5:35 AM

Power Holiday: ఏపీలో విద్యుత్‌కోతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పవర్‌కట్‌ ప్రభావం పరిశ్రమలను షేక్‌ చేస్తుండగా…అటు ఇళ్లలోనూ గంటల తరబడి కరెంట్‌ కోతతో జనం అల్లాడిపోతున్నారు. మండువేసవిలో విద్యుత్‌ (Power) లేక ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మండువేసవిలో కరెంట్ లేక జనాలు విలవిలలాడిపోతున్నారు. పల్లెలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇదే సీన్‌. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలాంటి ప్రధాన నగరాల్లోనూ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు. పవర్‌ కట్స్‌ (Power Cuts)తో ప్రజలు అల్లాడి పోతున్నారు. గత పదిరోజులుగా అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలోనూ అనధికారికంగా కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. గంటల తరబడి సాగుతున్న పవర్‌కట్స్‌తో మరింతగా అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో విద్యుత్‌ కోతలతో పేషెంట్లు నరకం అనుభవిస్తున్నారు. కొన్ని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. గర్భిణీలకు కూడా చీకట్లోనే డెలివరీ చేయాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

పవర్‌హాలిడే విశాఖ ఇండస్ట్రియల్‌ని వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న పారిశ్రామిక రంగాన్ని పవర్ కట్ కలవరానికి గురి చేస్తోంది. ఆటోనగర్‌లో ఉన్న 12 వందల పరిశ్రమలో 10 వేలమందికిపైగా సిబ్బంది ఉపాధి పొందుతున్నారు. పవర్ హాలిడేతో పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పల్నాడు జిల్లాలో పరిశ్రమలకు పవర్ హాలిడే అమలవుతోంది. దాచేపల్లి, మాచర్ల డివిజన్‌లలో సున్నం మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేశారు. సున్నం మిల్లులు మూతపడటంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు‌. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ హాలిడేలు ఇలాగే కొనసాగితే పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని కార్మిక సంఘ నేతలు వాపోతున్నారు.

పవర్‌హాలిడేతో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌, రసాయన, ఔషధ పరిశ్రమలు మూతపడే పరిస్థితికి చేరాయి. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, మద్దిపాడు, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ప్రాంతంలో గత పదిరోజులుగా 10 గంటలు పవర్‌కట్‌, ఇప్పుడు పవర్‌హాలిడేతో పనులు నిలిచిపోయాయి. ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. కోతలకు తోడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు తప్పడంలేదని పరిశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. విద్యుత్‌ కోతలు, పవర్ హాలిడే కారణంగా పరిశ్రమ యజమానులే కాకుండా కార్మికులు కూడా తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొనేందుకు ఇబ్బందులు ఉండటంతో వినియోగం తగ్గించుకునేందుకు కోతలు విధించక తప్పడం లేదన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి. కరెంట్‌ కష్టాలను అధిగమించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి పెరుగుతున్న విద్యుత్‌ వినియోగాన్ని సర్దుబాటు చేసేందుకు అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఏ రోజుకారోజు బొగ్గు కొనాల్సి రావడంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా..? ఆ రోజు అసలు ఏం జరిగింది!

Pakistan: అవిశ్వాస తీర్మానంలో బలంలేక కుప్పకూలిన ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌.. రేపు కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా..? ఆ రోజు అసలు ఏం జరిగింది!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu