AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
ప్రేమించిన యువతి ఫోన్ లిఫ్ట్ చేయలేదనే చిన్న కారణంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ...
ప్రేమించిన యువతి ఫోన్ లిఫ్ట్ చేయలేదనే చిన్న కారణంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో నివాసముండే అశోక్ కుమార్ బుట్టాయిగూడెం(Buttaigudem)లో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. అతనికి అదే మండలంలోని పి. నారాయణపురం గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. సదరు యువతిని అశోక్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు(Love). ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చిన్న ఘర్షణ ఏర్పడింది. దీంతో అశోక్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ కుమార్ సోమవారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ మూడు రోజులు చికిత్స పొంది ఇంటికి వెళ్లాడు. డిశ్ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తర్వాత అశోక్ కుమార్ ఆరోగ్యం మరోసారి విషమించింది. దీంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అశోక్ కుమార్ మృతి చెందాడు. తమను జాగ్రత్తగా చూసుకంటాడన్న కుమారుడు.. ప్రేమ పేరుతో ఆత్మహత్య చేసుకోవడంపై మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
– బి.రవి కుమార్, టీవీ9 తెలుగు, పశ్చిమగోదావరి జిల్లా
Also Read
TTD Tokens: సర్వదర్శనం టోకెన్ల కోసం బారులు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు
UNO: కరోనాపై ఐరాస షాకింగ్ కామెంట్స్.. ముగింపు దశలో లేదని హెచ్చరిక
Viral Video: భయం, బెరుకు లేకుండా దంతాలు శుభ్రం చేసింది.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్