Gold Silver Price Today: బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్నిరోజుల నుంచి మార్కెట్‌లో

Gold Silver Price Today: బ్యాడ్‌న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Silver Price
Follow us

|

Updated on: Apr 10, 2022 | 6:27 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్నిరోజుల నుంచి మార్కెట్‌లో (Bullion Market) బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.48,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.350, 24 క్యారెట్లపై రూ.390 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కూడా రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.67,100 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,190, 24 క్యారెట్ల ధర రూ.53,660 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.71,500 ఉంది. బెంగళూరులో రూ.71,500, కేరళలో రూ.71,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,500, విజయవాడలో రూ.71,500, విశాఖపట్నంలో రూ.71,500 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని ఉందా? ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే

Discount For Electric Cycle: ఎలక్ట్రిక్ సైకిళ్ల కొనుగోలుదారులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే..