AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak-Chian: ఖాన్ కంటే మెరుగ్గా షాబాజ్ పాలన ఉంటుంది.. పాకిస్తాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..

ఇమ్రాన్ ఖాన్ తన హయాంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన డ్రాగన్ కంట్రీ.. నేడు ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి తప్పుకోవడంపై అదే చైనా హర్షం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి, ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి తొలగించబడిన..

Pak-Chian: ఖాన్ కంటే మెరుగ్గా షాబాజ్ పాలన ఉంటుంది.. పాకిస్తాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..
China Pakistan
Sanjay Kasula
|

Updated on: Apr 11, 2022 | 1:38 PM

Share

ఇమ్రాన్ ఖాన్ తన హయాంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన డ్రాగన్ కంట్రీ.. నేడు ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి తప్పుకోవడంపై అదే చైనా హర్షం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి, ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అధికారం నుంచి తొలగించబడిన తర్వాత షాబాజ్ షరీఫ్ కొత్త ప్రధాని అయ్యే అవకాశాలపై ఆదివారం చైనా ప్రభుత్వ మీడియా సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఖాన్ పాలన కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రశంసలు కరిపించింది. ఈ ఘటనతో చైనా కంత్రీ బుద్ది మరోసారి బయటపడింది.

చైనాతో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదు

సోమవారం నాటి పార్లమెంట్ సమావేశం అనంతరం మూడుసార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను చూసుకుంటారని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ కథనం పేర్కొంది. పాకిస్తాన్‌లో అంతర్గత రాజకీయ మార్పుల వల్ల చైనా, పాకిస్తాన్‌ల మధ్య బలమైన సంబంధాలు దెబ్బతింటాయని చైనా, పాక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

షరీఫ్ కుటుంబం ఎప్పుడూ చైనాతో మెరుగైన సంబంధాలకు అనుకూలంగా ఉంది 

ఆ కథనంలో, పాకిస్తాన్‌లో అధికార పెత్తనం ఇప్పుడు షరీఫ్ కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. ఇది చాలా కాలంగా చైనా-పాకిస్తాన్ సంబంధాలను ప్రోత్సహిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు రెండు దేశాల మధ్య సహకారం ఇమ్రాన్ ఖాన్ కంటే మెరుగ్గా ఉంటుంది.

నవాజ్ కాలంలో చైనా బంధం..

నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రెండు దేశాల మధ్య $60 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ఎలా అభివృద్ధి చెందిందో ఈ నివేదిక వివరిస్తుంది. ఖాన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుపై విమర్శలు చేయడంతో చైనా ఆయన పాలనకు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, 2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క మారింది.

ఆర్థిక రంగంలో ఇమ్రాన్ విఫలం- చైనా 

పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీల విభేదాలు, అక్కడి ఆర్థిక సంక్షోభం, ప్రజల జీవనోపాధి సమస్యలే పాకిస్తాన్‌లో ప్రస్తుత రాజకీయ మార్పులకు ప్రధాన కారణమని సింఘువా యూనివర్సిటీలోని నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధన విభాగం డైరెక్టర్ కియాన్ ఫెంగ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక రంగంలో విఫలమయ్యారని, దేశాన్ని రక్షించే బదులు ముంచేశారని కియాన్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో అసమ్మతి సెగలు.. సుచరిత బాటలో గిద్దలూరు ఎమ్మెల్యే..