Jr.NTR: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ ఆమెనేనా ?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr.) ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ తోపాటు..

Jr.NTR: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ ఆమెనేనా ?
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2022 | 9:43 AM

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr.) ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ఎన్టీఆర్ తోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూల్లూ సాధించి రికార్డ్స్ తిరగరాస్తోంది. ఇందులో తారక్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్.. అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలోనూ తారక్ ఓ సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‏లో 31వ సినిమాగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రాబోతుంది. తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను ఎంపిక చేశారని సమాచారం. ఈ విషయాన్ని ఫేమస్ సినీ క్రిటిక్ ఉమైర్ సింధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఉమైర్ సింధు ట్వీట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పంధిస్తున్నారు. ప్రస్తుతం దీపికా..బాలీవుడ్ స్టా్ర్ హీరో షారుఖ్ సరసన పఠాన్ సినిమాలో నటిస్తోంది. అలాగే ఫైటర్.. ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే మూవీలో నటిస్తోంది. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 2 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో ఎన్టీఆర్ సినిమా..  ఆ విషయం మాత్రం అడగొద్దంటూ డైరెక్టర్ కామెంట్స్.. 

Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు