Raviteja: టాలీవుడ్‏లో మరో స్టార్ మల్టీస్టారర్.. రవితేజతో ఆ స్టార్ హీరో మూవీ ?..

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హావా నడుస్తోంది. ఇప్పటిక పలువురు స్టార్ హీరోస్ కలిసి నటించి మల్టీస్టారర్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Raviteja: టాలీవుడ్‏లో మరో స్టార్ మల్టీస్టారర్.. రవితేజతో ఆ స్టార్ హీరో మూవీ ?..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2022 | 8:44 AM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హావా నడుస్తోంది. ఇప్పటిక పలువురు స్టార్ హీరోస్ కలిసి నటించి మల్టీస్టారర్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టిస్తోంది. మరోవైవు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 మూవీలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో మరో మల్టీ్స్టారర్ రానున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi ) ఇందుకు సంబంధించి ఓ కథను సిద్ధం చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే మూవీలో ఓ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ బాలయ్యకు తెగ నచ్చిందట. దీంతో వెంటనే ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం బాలయ్యతోపాటు.. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో బాలయ్య రవితేజలను ఒకే ఫ్రేములోకి తీసుకువచ్చేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, దమాకా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read: Kalavathi Song: కళావతి పాటకు హీరోయిన్ లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్‏లో ఎన్టీఆర్ సినిమా..  ఆ విషయం మాత్రం అడగొద్దంటూ డైరెక్టర్ కామెంట్స్.. 

Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు