AP New Cabinet: ఇవాళ కొలువుదీరనున్న జగన్ నూతన మంత్రివర్గం.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రివర్గం సోమవారం కొలువు తీరనుంది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు ముందుగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రివర్గం సోమవారం కొలువు తీరనుంది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.31 గంటలకు తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదిక రెడీ చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్‌లు చేసి సమాచారం అందించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగుతారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది. ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.
ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు 24 మంది మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని తెలుస్తోంది.
కొత్త కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశారు. ఏకంగా 10మంది బీసీలకు చోటుకల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించారు. ఫైనల్‌గా పాత-కొత్త కలయికతో ఏపీ కేబినెట్ కొలువు దీరబోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవం.. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణతో మరో సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బీసీలకు 10, ఎస్సీలకు- 5, ఎస్టీలు, మైనారిటీలకు చెరొకటి, కాపు-రెడ్డి సామాజిక వర్గాలకు చెరో నాలుగు పదవులు కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా పదిమంది బీసీలకు మంత్రి పదవులు కేటాయించారు.
ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: బెర్త్ దక్కకపోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. మొదలైన బుజ్జగింపులు..
Jagan 2.0: మంత్రి పదవి రాలేదని ఒకరు.. ఉన్న పదవి పోయిందని మరొకరు.. వైసీపీలో అసమ్మతి గళం..