AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagan Cabinet 2.0: బెర్త్ దక్కకపోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. మొదలైన బుజ్జగింపులు..

దీంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. దీంతో సీన్‌లోకి ఎంటరైన సజ్జల శ్రీకాంత్ రెడ్డితో పాటు..

Jagan Cabinet 2.0: బెర్త్ దక్కకపోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. మొదలైన బుజ్జగింపులు..
Ycp
Sanjay Kasula
|

Updated on: Apr 10, 2022 | 10:27 PM

Share

సామాజిక న్యాయం జరిగే క్రమంలో కొంతమంది నేతలకు కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. పదవులు ఆశించిన బాలినేని, పిన్నెల్లి, ఉదయభాను, కోటంరెడ్డి, కరణం ధర్మశ్రీ, సుచరిత, అన్నా రాంబాబులకు నిరాశ ఎదురైంది. దీంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. దీంతో సీన్‌లోకి ఎంటరైన సజ్జల శ్రీకాంత్ రెడ్డితో పాటు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించారు. మరోవైపు సుచరిత ఇంటికి వెళ్లిన మోపిదేవి వెంకటరమణను కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు సీఎంవో ఆఫీస్‌ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కాల్‌ వెళ్లినా ఆయన స్పందించలేదు. పిన్నెల్లికి కాల్ చేసిన సీఎంవో అధికారులు.. తొందరపడొద్దని సూచించారు. కేబినెట్‌లో పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు సుచరిత. అయితే అవకాశం దక్కకపోవడంతో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారు. అదే లేఖను మోపిదేవి వెంకటరమణకు అందించారు. మరో అసంతృప్తి నేత అన్నా రాంబాబు రేపు రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..