Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

YS Jagan New Cabinet: గుడివాడ అమర్నాథ్, వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. జగన్‌కు వీర విధేయుడు. విధేయత కోటాలో అమర్నాథ్‌ను తాజాగా మంత్రి పదవి వరించింది. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా విశాఖ జిల్లాలో వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌..

Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..
Gudivada Amarnath
Follow us

|

Updated on: Apr 10, 2022 | 7:30 PM

గుడివాడ అమర్నాథ్, వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. జగన్‌కు వీర విధేయుడు. విధేయత కోటాలో అమర్నాథ్‌ను(Gudivada Amarnath) తాజాగా మంత్రి పదవి వరించింది. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా విశాఖ జిల్లాలో వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ గుడివాడ అమర్నాథ్. విశాఖ జిల్లా నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా అమర్నాథ్‌కు పేరుంది. తాజాగా అయన్ను మంత్రి పదవి వరించింది(YS Jagan New Cabinet). 22 జనవరి 1985లో విశాఖపట్నం జిల్లా, అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గుడివాడ గురునాథ రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అమర్‌నాథ్‌ బి.టెక్ వరకు చదువుకున్నారు. గుడివాడ అమర్‌నాథ్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2006లో తన 21వ ఏటలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు.

అంతేకాదు అమర్‌నాథ్‌ అతి పిన్న వయస్సులో విశాఖపట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశారు గుడివాడ అమర్నాథ్. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీల పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్‌గా పనిచేశారు.

గుడివాడ అమర్‌నాథ్‌ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవింద సత్యనారాయణపై 8వేల 169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా, 2019లోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, కొన్ని సమీకరణాలతో, అమర్నాథ్‌కు అవకాశం రాలేదు. తాజా మంత్రివర్గంలో గుడివాడ అమర్నాథ్‌కు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. కాపు సామాజిక వర్గం, జగన్‌కు విధేయుడు కావడంతో అమర్నాథ్‌కు అవకాశం వచ్చిందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..

Viral Video: అడ్డా నాది.. గడ్డా నాది.. పారిపో.. సోషల్ మీడియాలో గ్రామం సింహం సందడి..