TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..

Chalo Delhi Protest: ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష..

TRS: ఛలో ఢిల్లీ.. టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..
Trs Agitation
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 10, 2022 | 7:10 PM

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. 1500 ప్రజాప్రతినిధులు స్టేజ్‌పై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణలుఉ ఢిల్లీకి చేరుకున్నాయి. రైతులకు రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కేంద్ర పభ్రుత్వ బాధ్యత అని చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు . తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం కొనసాగాలన్నారు.

జాతీయ స్థాయిలో ఒకే ధాన్యం సేకరణ పాలసీ ఉండాలన్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయం.. విదేశాంగ మంత్రిగా జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు.. 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!