AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriages: వివాహ ముహూర్తాలకు వేళాయే.. రాములోరి పరిణయం తర్వాత మూడు నెలలు కల్యాణ ఘడియలు

వేసవి సీజన్(Summer Season) ప్రారంభం కావడంతో పెళ్లి కళ వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనా(Corona) తో శుభకార్యాలు, వివాహాలు కళ తప్పాయి. ఫలితంగా ఈ ఎండాకాలం సీజన్ లో భారీగా ముహుర్తాలు ఉన్నాయి. శుభకృత్ నామ సంవత్సరంలో అధిక సంఖ్యలో...

Marriages: వివాహ ముహూర్తాలకు వేళాయే.. రాములోరి పరిణయం తర్వాత మూడు నెలలు కల్యాణ ఘడియలు
Marriage(representative image)
Ganesh Mudavath
|

Updated on: Apr 10, 2022 | 5:32 PM

Share

వేసవి సీజన్(Summer Season) ప్రారంభం కావడంతో పెళ్లి కళ వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనా(Corona) తో శుభకార్యాలు, వివాహాలు కళ తప్పాయి. ఫలితంగా ఈ ఎండాకాలం సీజన్ లో భారీగా ముహుర్తాలు ఉన్నాయి. శుభకృత్ నామ సంవత్సరంలో అధిక సంఖ్యలో వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్‌, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నట్లు పంతుళ్లు చెబుతున్నారు. ఏప్రిల్ లో 13, 14, 15, 16, 17, 21, 22, 24, మే నెలలో 3, 4, 12, 13, 14, 15, 18, 20, 21, 22, 25, జూన్ నెలలో 1, 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒకే రోజు నాలుగైదు వేడుకలు(Celebrations) ఉండడం విశేషం. ఇప్పటికే కల్యాణ మండపాలన్నీ బుక్‌ అయ్యాయి. రానున్న మూడు నెలల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లోని ఫంక్షన్‌ హాళ్లలో రోజుకు రెండు చొప్పున శుభకార్యాలకు బుక్‌ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. డిజైన్లలో పెళ్లి పత్రికల తయారీ, నూతన వస్త్రాల కొనుగోలు, ఫంక్షన్‌ హాల్‌, పురోహితులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, డెకరేషన్‌, టెంట్‌ హౌస్‌ నిర్వాహకులు, దర్జీలు, బ్యాండ్‌, మేకప్‌, బంగారం వ్యాపారులు, ఇలా ఎన్నో రంగాల వారికి శుభకార్యాలతో ఉపాధి దొరుకుతుంది.

పంచాంగాన్ని బట్టి ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాహాది శుభకార్యాలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లంటే సందడి.. వివిధ రంగాల వారికి ఉపాధినిచ్చే పండగ. మరోవైపు.. చాలా చోట్ల భజంత్రీలకు డిమాండ్‌ పెరిగింది. దక్షిణ సన్నాయి మేళం కనీసం రూ.18 వేలు చెల్లిస్తేనే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దపెద్ద బ్యాండ్‌ బాజాలు రూ. 60 వేలు దాటి వసూలు చేస్తున్నాయి. వంట మాస్టార్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. సౌండ్‌ సప్లయర్స్, డీజేలకూ మంచి గిరాకీ ఉంది. గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన వీరంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Also Read

Sreemukhi: చీరలో బుల్లితెర బ్యూటీ అందాలు చూడతరమా.. అదిరిన శ్రీముఖి లేటెస్ట్ పిక్స్..

viral video: పైథాన్‌ తోక పట్టుకుని ఆటలు.. కింగ్‌ కోబ్రా తలపై ముద్దులు.. షాకింగ్ వీడియోలు!

IPL 2022: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తర్వాతి మ్యాచ్‌లకు దూరమైన కీలక బౌలర్.. ఎందుకంటే?

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?