viral video: పైథాన్‌ తోక పట్టుకుని ఆటలు.. కింగ్‌ కోబ్రా తలపై ముద్దులు.. షాకింగ్ వీడియోలు!

మీరెప్పుడైనా కింగ్‌ కొబ్రాని దగ్గరగా చూశారా? కనీసం దాని తోకైనా పట్టుకున్నారా?.. అలా చేస్తే మా గుండెకాయ అప్పుడే టపాకాయ పేలినట్లు పేలిపోయేదని అనుకుంటున్నారు కదూ..! నిజమే.. సాధారణంగా మనలో చాలా మందికి..

viral video: పైథాన్‌ తోక పట్టుకుని ఆటలు.. కింగ్‌ కోబ్రా తలపై ముద్దులు.. షాకింగ్ వీడియోలు!
Viral Video
Follow us

|

Updated on: Apr 10, 2022 | 4:00 PM

Goosebumps while watching this scary video: మీరెప్పుడైనా కింగ్‌ కొబ్రాని దగ్గరగా చూశారా? కనీసం దాని తోకైనా పట్టుకున్నారా?.. అలా చేస్తే మా గుండెకాయ అప్పుడే టపాకాయ పేలినట్లు పేలిపోయేదని అనుకుంటున్నారు కదూ..! నిజమే.. సాధారణంగా మనలో చాలా మందికి పాములంటే నిజంగా చచ్చేంత భయం. అవి అల్లంత దూరాన కనిపించగానే, ఇటునుంచిటే పరుగులంకించుకుంటాం.. కానీ ఓ చిచ్చరపిడుగు ఏ మాత్రం జంకుబొంకు లేకుండా దానితో ఆటలాడేసుకుంటోంది. మరో గడుసు పిల్లేమో ఏకంగా కోబ్రాకి ముద్దే పెట్టేసింది. అవి చిన్న చిన్న పిల్ల పాములనుకునేరు? కానేకాదు.. చూస్తే మీ కళ్లు తిరగడం కాయం..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఓ చిన్న పాప భయంకరమైన బ్లాక్‌ పైథాన్‌తో ఆడుకోవడం కనిపిస్తుంది. నేలపై పాకుతూ పారిపోతున్న పైథాన్‌ను ఈ చిన్న పాప ధైర్యంగా తోక పట్టుకులాగి పట్టుకోవడాన్ని చూస్తే చమటలు పట్టేస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వీక్షణలు, వేలల్లో కామెంట్లు వచ్చిపడటంతో నెట్టింట వైరలయ్యింది.

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

మరొక వీడియోలో ఓ అమ్మాయి పడగవిప్పి కామ్‌గా నిల్చున్న నిలువెత్తు కోబ్రాని ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు దాని తలపై ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఏది ఏమైనా పాములు అత్యంత ప్రమాదకరమైన విష జంతువులు. మానవ స్వభావానికి ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. అంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. క్షణకాలం థ్రిల్‌ కోసం చేసే ఈ స్టంట్లు ఏ మాత్రం బెడిసి కొట్టినా వెలకట్టలేని మూల్యం చెల్లించవల్సి వస్తుంది. ఈ వీడియోకు కూడా ఇప్పటికే మిలియన్ల కొద్ది వీక్షణలు వచ్చాయి. మీ కుటుంబ సభ్యులు పాముకు బదులు మంచి బొమ్మలను కొనిపెడితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీరు మాత్రం ఇలాంటి స్టంట్లు అస్సలు ప్రయత్నించకండే..

Also Read:

AP Polycet 2022 exam date: ఏపీ పాలీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..