AP Polycet 2022 exam date: ఏపీ పాలీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గానూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2022 నోటిఫికేషన్‌ను ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి (SBTET AP) విడుదల చేసింది..

AP Polycet 2022 exam date: ఏపీ పాలీసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
Ap Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2022 | 2:24 PM

AP Polycet 2022 Registration last date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గానూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2022 నోటిఫికేషన్‌ను ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి (SBTET AP) విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్‌ 11 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ polycetap.nic.inలో, ఆన్‌లైన్‌ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఏప్రిల్‌/మే 2022 టెన్త్‌ పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్ధులు కూడా అర్హులే. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400లు విధిగా చెల్లించాలి. ఏప్రిల్‌ 11 నుంచి మే 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్ధులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా మండలి ఈ సందర్భంగా సూచించింది. ఇక పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష (AP Polycer 2022) మే 29 (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.

ఏపీ పాలీసెట్‌ 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి ఇతర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

NIO Kochi Recruitment 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ఉద్యోగావకాశాలు..