TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెరిగేనా.. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు..!

TS Police Jobs: త్వరలో తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఇప్పటికే ఆర్థిక, పోలీసు, వైద్య, విద్యా శాఖలోని ఖాళీల వివరాలని ప్రభుత్వం వెల్లడించింది.

TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెరిగేనా.. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు..!
Ts Police Jobs
Follow us
uppula Raju

|

Updated on: Apr 11, 2022 | 10:26 AM

TS Police Jobs: త్వరలో తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఇప్పటికే ఆర్థిక, పోలీసు, వైద్య, విద్యా శాఖలోని ఖాళీల వివరాలని ప్రభుత్వం వెల్లడించింది. నియామక ప్రక్రియకు కార్యాచరణ కూడా సిద్దమవుతోంది. సర్కారు ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువగా పోలీస్‌ జాబులే ఉన్నాయి.16,587 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులు, గ్రూప్‌–1లో డీఎస్పీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, రీజినల్‌ ట్రా న్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ విభాగాల్లో 120 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంచుతారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి గ‌రిష్ట వ‌యోప‌రిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వయోపరిమితి యూనిఫాం సర్వీసులకు వర్తించదు.

గ్రూప్‌–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, ఆర్టీవో పోస్టులు ఉన్నాయి. వీటిలో జనరల్‌ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. పోలీస్‌ జాబులకి కూడా వయోపరిమితి పెంచి నిరుద్యోగులకి సరైన న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Funny Video: పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా..!