Funny Video: పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!

Funny Video: సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్‌లు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అడవి జంతువులు. కానీ ఒక్కో సందర్భంలో ఇవి చాలా చిన్న జంతువులకి భయపడాల్సిన

Funny Video: పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!
Funny Video
Follow us
uppula Raju

|

Updated on: Apr 11, 2022 | 8:56 AM

Funny Video: సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్‌లు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అడవి జంతువులు. కానీ ఒక్కో సందర్భంలో ఇవి చాలా చిన్న జంతువులకి భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రత్యేకించి జాగ్వార్ గురించి మాట్లాడినట్లయితే.. ఇది పులిలా కనిపిస్తుంది కానీ చిరుతపులి కంటే పెద్ద జంతువు. అంతేకాదు చాలా శక్తివంతమైనది వేటలో ప్రమాదకరమైనది. జాగ్వర్లు అడవి జంతువులను వేటాడే చాలా వీడియోలని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు ఒక తమాష వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్స్‌తో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక జాగ్వర్ తాబేలును వేటాడేందుకు ప్రయత్నించడం మనం చూడవచ్చు. కానీ ఎంత ట్రై చేసినా దానిని వేటాడలేకపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వుతారు. వాస్తవానికి తాబేళ్ల ప్రత్యేకత ఏంటంటే వాటి శరీరంపై ఉండే పైభాగంచాలా గట్టిగా ఉంటుంది. అవి భయపడినప్పుడు లేదా ప్రమాదం ఎదురైనప్పుడు తలని దానిలోపల పెట్టుకొని ప్రాణాలని కాపాడుకుంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే జరిగింది. తాబేలు తన నోటిని షెల్ లోపల దాచుకుంటుంది. దీంతో జాగ్వర్ ఎంత ప్రయత్నించినా దాని మెడని పట్టుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతకాకుండా ఫన్నీ కామెంట్స్‌తో తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.

ఈ వీడియోని ఒక నెటిజన్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియో 1 మిలియన్ కంటే ఎక్కువ అంటే 10 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. 33 వేల మందికి పైగా లైక్‌ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

 

IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో చాహల్‌ అరుదైన ఘనత.. ఈ రికార్డ్‌ సాధించిన ఆరో వ్యక్తి..

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

RR vs LSG: అశ్విన్ షాకింగ్‌ నిర్ణయం.. IPL చరిత్రలో మొదటిసారి..!