IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో చాహల్‌ అరుదైన ఘనత.. ఈ రికార్డ్‌ సాధించిన ఆరో వ్యక్తి..

IPL 2022: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్‌(LGS) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నోపై 3 పరుగుల

IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో చాహల్‌ అరుదైన ఘనత.. ఈ రికార్డ్‌ సాధించిన ఆరో వ్యక్తి..
Yuzvendra Chahal
Follow us
uppula Raju

|

Updated on: Apr 11, 2022 | 8:00 AM

IPL 2022: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్‌(LGS) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నోపై 3 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కష్టాల్లో ఉన్న జట్టును శిమ్రన్‌ హెట్మేయర్ 36 బంతుల్లో 59 (ఆరు సిక్స్‌లు, ఒక ఫోర్) పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. పడిక్కల్‌ 29 బంతుల్లో 29 (4 ఫోర్లు), అశ్విన్‌ 23 బంతుల్లో (2 సిక్స్‌లు) 28 పరుగులు చేశాడు. 166 పరుగుల లక్ష్య ఛేదన మొదలు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్‌ని దీపక్ చాహర్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఏకంగా నాలుగు వికెట్లు సాధించి అరుదైన క్లబ్‌లో చోటు సంపాదించాడు.

దుష్మంత చమీరాను ఔట్‌ చేయడం ద్వారా చాహల్‌ ఐపీఎల్‌లో 150వ వికెట్‌ సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చాహల్‌ కంటే ముందు డ్వేన్‌ బ్రావో 173 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. లసిత్‌ మలింగ 170 వికెట్లతో రెండు, అమిత్‌ మిశ్రా 166 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు.157 వికెట్లతో పియూష్‌ చావ్లా నాలుగో స్థానంలో ఉండగా.. హర్బజన్‌ సింగ్‌ 150 వికెట్లతో ఐదో స్థానంలో ఉండగా.. తాజగా చాహల్‌ 150 వికెట్లతో భజ్జీ సరసన చేరాడు. ఇక చాహల్‌ తొలి 50 వికెట్లు 40 మ్యాచ్‌ల్లో అందుకోగా.. మలి 50 వికెట్లు 44 మ్యాచ్‌ల్లో సాధించాడు. తాజాగా మూడో విడత 50 వికెట్లను మాత్రం కేవలం 34 మ్యాచ్‌ల్లోనే అందుకోవడం విశేషం.

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

RR vs LSG: అశ్విన్ షాకింగ్‌ నిర్ణయం.. IPL చరిత్రలో మొదటిసారి..!