3 మ్యాచ్‌ల్లో 551 పరుగులు.. తుఫాన్ బ్యాటింగ్‌తో బౌలర్ల ఊచకోత.. ఈ రూ. 2 కోట్ల ప్లేయర్ విలన్‌గా మారాడా?
ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు గెలుపు...
ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే ఢిల్లీ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ చివర్లో మ్యాజిక్ స్పెల్ వేయడంతో.. ఈ మ్యాచ్‌లో డీసీ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరును కనబరిచి.. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ తన బ్యాటింగ్‌తో సత్తా చాటిన ఓ బ్యాటర్‌కు ప్లేయింగ్-ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక అతడెవరో కాదు సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోన్న సర్ఫరాజ్‌కు నిన్న ప్లేయింగ్ ఎలెవన్‌లో బ్యాటింగ్‌కు ఛాన్స్ దక్కలేదు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌కి ఇది రెండో మ్యాచ్. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అజేయంగా 36 పరుగులు చేయగా.. నిన్నటి మ్యాచ్‌లో అస్సలు బ్యాటింగ్ చేసేందుకు ఛాన్సే దక్కలేదు.
సర్ఫరాజ్ కంటే ఇతరులకే ప్రాధ్యానత..
సాధారణంగా సర్ఫరాజ్ నెంబర్ 4 లేదా 5లో బ్యాటింగ్‌కు దిగుతాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో లలిత్ యాదవ్(1) నాలుగో నెంబర్‌లో.. రోవ్‌మన్ పావెల్(8) నెంబర్ 5లో వచ్చి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వీరి తర్వాత అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌లను బ్యాటింగ్‌కు పంపారు. ఈ సీజన్‌లో ఆకట్టుకోలేకపోయిన లలిత్ యాదవ్, పావెల్‌లకు బదులుగా సర్ఫరాజ్‌కు ముందుగా బ్యాటింగ్‌కు పంపకపోవడంతో అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వేగంగా పరుగులు చేయడం, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంలో సర్ఫరాజ్ దిట్ట. టీ20లో సర్ఫరాజ్ స్ట్రైక్ రేట్134.15 కాగా, సగటు 22.69గా ఉంది.
అద్భుత ఫామ్‌లో సర్ఫరాజ్..
ఐపీఎల్ కంటే ముందు రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తన అద్భుతమైన ఆటతీరును కనబర్చాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌లో, అతడు ముంబై తరపున మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ మూడింటిలోనూ 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. సౌరాష్ట్రపై 275 పరుగులు, గోవాతో జరిగిన మ్యాచ్‌లో, అతడు మొదటి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశాడు. ఒడిశాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 165 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.