uppula Raju |
Updated on: Apr 11, 2022 | 12:28 AM
తాజా పండ్లు: మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే స్వీట్లు తినడానికి ఇష్టపడితే తాజా పండ్లను తినవచ్చు. ఎండాకాలం పుచ్చకాయ తినడం వల్ల షుగర్ లెవెల్ పెరగదు శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
మామిడి ఆకులు: వేసవిలో లభించే మామిడి ఆకులతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఆకులను రాత్రంతా నీళ్లలో పెట్టి ఉదయం లేచి అల్పాహారం తర్వాత తాగాలి.
హెర్బల్ టీ: వేసవిలో టీ తాగడం మంచిది కానప్పటికీ షుగర్ రోగులు హెర్బల్ టీని తీసుకోవాలి. పరగడుపున ఈ టీ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.
మెరుగైన నిద్ర: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవడం ముఖ్యం. సరైన నిద్ర లేకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
యోగా: మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు సాధారణ వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయాలి. ఇది లోపల నుంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోజంతా చురుగ్గా ఉంచుతుంది. యోగా చేయడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది.