Telangana: భోజనాలు పెట్టలేదని బహిష్కరణ.. కులపెద్దల వేధింపులకు తీవ్ర మనస్తాపం.. చివరికి ఏం చేశారంటే
శాస్త్ర సాంకేతికత రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. మనుషులంతా ఒక్కటే అన్న సమైఖ్య స్ఫూర్తికి కొందరు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. కులం పేరుతో...
శాస్త్ర సాంకేతికత రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. మనుషులంతా ఒక్కటే అన్న సమైఖ్య స్ఫూర్తికి కొందరు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. కులం పేరుతో వేధింపులు, దాడులు అక్కడక్కడా ఉనికి చాటుతున్నాయి. తాజాగా కులపెద్దలకు భోజనం పెట్టలేదన్న కారణంలో ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. వారి వేధింపులు తాళలేక ఆ కుటుంబం ఇంటి ముందు తాళం వేసుకుని నిరసన(Protest) చేపట్టింది. తెలంగాణలోని కామారెడ్డి(Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన పోశయ్య కుమార్తె ఏడాది క్రితం వివాహం చేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి తమకు భోజనాలు(Wedding Meals) పెట్టాలని కులపెద్దలు పోశయ్యను అడుగుతున్నారు. ఇదే సమయంలో దుబాయ్ వెళ్లిన పోశయ్య కుమారుడు మహిపాల్ ఇంటికి వచ్చాడు. ఇప్పుడైనా భోజనాలు పెట్టాల్సిందేనని వారు మరింతగా పట్టుబట్టారు. దీనికి పోశయ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఫలితంగా గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యాలకు ఏడాదిపాటు పిలవకుండా బహిష్కరించారు. అతిక్రమిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన పోశయ్య కుటుంబసభ్యులు ఇంటి ముందు కూర్చుని నిరసన చేపట్టారు. ఇన్ని అవమానాలు భరించడం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే మేలని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read
Raviteja: టాలీవుడ్లో మరో స్టార్ మల్టీస్టారర్.. రవితేజతో ఆ స్టార్ హీరో మూవీ ?..
AP New Cabinet: ఇవాళ కొలువుదీరనున్న జగన్ నూతన మంత్రివర్గం.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం..
Meru School Hyderabad: మేరు స్కూల్ ఘనత.. బ్రైన్‌ఫీడ్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2022 కైవసం