BJP – TRS: డైలాగుల్లోనే కాదు.. ఉద్యమ కార్యాచరణలోనూ తగ్గేదే లే.. ఢిల్లీకి హైదరాబాద్‌లో బీజేపీ కౌంటర్‌..

ఆరోపణలు.. డైలాగుల్లోనే కాదు.. ఉద్యమ కార్యాచరణలోనూ తగ్గేదే లే అంటున్నాయి బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు. హస్తినలో గులాబీ దండు మొహరిస్తే.. దానికి పోటీగా హైదరాబాద్ గల్లీల్లో కమలం సైన్యం నిరసనలకు పిలుపునిచ్చింది.

BJP - TRS: డైలాగుల్లోనే కాదు.. ఉద్యమ కార్యాచరణలోనూ తగ్గేదే లే.. ఢిల్లీకి హైదరాబాద్‌లో బీజేపీ కౌంటర్‌..
Bjp Vs Trs
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 11, 2022 | 9:33 AM

ఆరోపణలు.. డైలాగుల్లోనే కాదు.. ఉద్యమ కార్యాచరణలోనూ తగ్గేదే లే అంటున్నాయి బీజేపీ(BJP), టీఆర్‌ఎస్ పార్టీలు(TRS). హస్తినలో గులాబీ దండు మొహరిస్తే.. దానికి పోటీగా హైదరాబాద్ గల్లీల్లో కమలం సైన్యం నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాల్సిందేనని ఢిల్లీలో టీఆర్‌ఎస్ దీక్షా కార్యక్రమం చేపడితే.. మీరే కొనాలంటూ రాష్ట్రంలో బీజేపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ధాన్యం సేకరణలో దేశ వ్యాప్తంగా ఒకే పాలసీ ఉండాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్న గులాబీ దండు.. ఇవాళ ఢిల్లీ వేదికగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకోబోతోంది. 2వేల మంది ఈ దీక్షలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌ దీక్షకు కౌంటర్‌గా తెలంగాణ బీజేపీ దీక్షా కార్యక్రమం చేపట్టింది. ఇందిరాపార్క్‌ దగ్గర బీజేపీ నేతలు రైతు దీక్ష చేయబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షలో కేంద్రమంత్రి మురళీధరన్‌ పాల్గొనబోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలనేది బీజేపీ డిమాండ్‌.

కాసేపట్లో సీఎం కేసీఆర్‌ దీక్షకు దిగనున్నారు. ముందుగా తెలంగాణ భవన్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం దీక్షలో కూర్చుంటారు సీఎం కేసీఆర్‌. ఈ రైతు దీక్షలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు మొత్తం హస్తినలో గళమెత్తనున్నారు.

ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..