Hindi: ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీనే.. అమిత్ షా కామెంట్స్‌పై కొత్త చర్చ..

Hindi: ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీనే.. అమిత్ షా కామెంట్స్‌పై కొత్త చర్చ..
Amit Shah

హిందీ భాషను ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా అంగీకరించాలని ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. అలాగే ఇంగ్లీష్ కు స్థానిక..

Venkata Chari

| Edited By: Sanjay Kasula

Apr 11, 2022 | 2:23 PM

హిందీ భాషను ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా అంగీకరించాలని ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. అలాగే ఇంగ్లీష్ కు స్థానిక భాషలు ప్రత్యామ్నాయం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేది అధికార భాషే అని ప్రధాన మంత్రి మోదీ నిర్ణయించారని, ఈమేరకు హిందీ భాషకు మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం కేబినెట్‌లోని 70 శాతం ఎజెండాలు హిందీలో సిద్ధమవుతున్నాయని, భారతదేశ ఐక్యతలో అధికార భాష హిందీ ఓ భాగంగా చేయాల్సిందేనని షా పేర్కొన్నారు. ఈమేరకు స్థానిక భాషలను కాకుండా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని తప్పక అంగీకరించాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మారుస్తారే తప్ప ప్రచారం చేయరాదన్నారు. వివిధ భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అది ‘భారతీయ భాష’లోనే ఉండాలని హోం మంత్రి అన్నారు. ఇతర స్థానిక భాషల పదాలను హిందీలో చేర్చి, ఈ దేశీయ భాషను మరింత అనువైనదిగా మార్చాలని ఆయన సూచించారు. 9వ తరగతి వరకు విద్యార్థులకు హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించాలని, హిందీ బోధన పరీక్షలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని కూడా హోంమంత్రి నొక్కి చెప్పారు.

హిందీని లింక్ లాంగ్వేజ్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన కొత్త వివాదానికి దారితీసింది. ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అది భారతీయ భాషలోనే ఉండాలని షా చెప్పినట్లుగా చర్చ మొదలైంది.

స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలన్నారు. ఈ చర్చ ఎలా ఉందంటే గుడ్డుపై ఈకల్ పీకినట్లుగా ఉందని కొందరు జాతీయ భాష విమర్శకులు కామెంట్స్ చేశారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్ అయిన అమిత్ షా, కేంద్ర మంత్రివర్గం 70 శాతం ఎజెండా  హిందీలో తయారు చేస్తున్నట్లుగా సభ్యులకు తెలియజేశారు.

జాతీయ భాష, దేశంలోని భాషా భాష గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 1937లో మద్రాసు (తమిళనాడు)లో కాంగ్రెస్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రయత్నించినప్పుడు.. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. 1965లో విద్యార్థులు ఊరేగింపులకు నాయకత్వం వహించి, ఆత్మాహుతి చేసుకున్నప్పుడు మరొక ఆందోళనకు తెరలేసింది.

1946 నుంచి 1950 వరకు, ద్రవిడర్ కజగం (DK), పెరియార్ EV రామస్వామి హిందీకి వ్యతిరేకంగా చెదురుమదురు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టినప్పుడల్లా హిందీ వ్యతిరేక నిరసనలు చెలరేగి తమిళనాడు ప్రాంతంలో ఆందోళనలు జరిగాయి. 

ఈ కాలంలో 1948 నుంచి 1950 వరకు అతిపెద్ద హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.

చివరికి, ప్రభుత్వం 1950లో హిందీ బోధనను ఐచ్ఛికం చేసింది. హిందీ నేర్చుకోవడానికి ఇష్టపడని విద్యార్థులు హిందీ తరగతుల సమయంలో ఇతర పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతించారు.

1987లో, హిందీ వ్యతిరేక నిరసనలు హింస, ప్రదర్శనలు మరియు 20,000 మందికి పైగా అరెస్టులకు దారితీశాయి. హిందీకి అధికారిక హోదా కల్పించే భారత రాజ్యాంగాన్ని తగలబెట్టినందుకు రాజకీయ నాయకులను రాష్ట్ర శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి రచ్చ అప్పటి, ఇప్పటి తమిళనాడులో సహజం. అయితే షా చెప్పినట్లుగా ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయం హిందీనే అని చెప్పారు. కానీ, భారతీయ భాషలు అన్ని గొప్పవే అని అనడం ఇక్కడ ఎవరు గుర్తించలేదు. 

గురువారం జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో వివిధ భారతీయ రాష్ట్రాల ప్రజలు హిందీ మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హిందీ Vs ప్రాంతీయ భాషల గొడవను మళ్లీ మళ్లీ రాజకీయంగా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందీ-జాతీయ-భాషా వాక్చాతుర్యం కాలానుగుణంగా ఎలా మారుతుందో ఆసక్తికరంగా ఉంది.

ఇవి కూడా చదవదండి: Minister RK Roja: ప్రమాణస్వీకారం వేల రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..

CM KCR: ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదు.. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కామెంట్స్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu